సెక్యూరిటీ గార్డ్లు నల్ల కళ్ళజోళ్ళని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..?

మనం ఎప్పుడైనా గమనించినట్లయితే సెక్యూరిటీ గార్డులు ఎప్పుడు చూసినా నల్ల కళ్ళజోడులని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైనా ఎందుకు నల్ల కళ్ళజోడుని సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నారని ఆలోచించారా…? మరి దాని వెనక ఉండే కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు మొదలైన వాళ్ళ వెనకాల సెక్యూరిటీ గార్డులు ఉంటారు. కండలు తిరిగిన శరీరంతో ఎంతో ఎత్తుగా వాళ్ళు ఉంటారు. తోపులాట లేదా రద్దీగా ఉండే ప్రదేశాలు నుండి సెలబ్రిటీలను రక్షిస్తూ ఉండడానికి వాళ్ళు పని చేస్తారు. ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్లని సురక్షితంగా చూసుకుంటారు.

అయితే నిత్యం వాళ్ళు నల్ల కళ్ళజోడుని పెట్టుకుంటుంటారు. దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే… ఎవరైనా ఏమైనా తప్పు చేస్తున్నారా లేదా అనేది వీళ్ళు గమనిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు గమనించేది ఎవరూ చూడకూడదని నల్ల కళ్ళజోడు ధరిస్తారు. అలానే వీళ్ళు ఎక్కువగా ఎండలో, వానలో దుమ్ము ధూళి మధ్య తిరుగుతూ ఉండాలి. అందుకని కంటికి రక్షణగా కూడా కళ్ళజోళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది.