జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. దీంతో వాహనదారులు…భయాందోళనకు గురయ్యారు. కృష్ణా నగర్ వైపు నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నకు వెళ్తూ రోడ్డు మధ్యలోని మెట్రో ఫిల్లర్ డివైడర్ ను ఢీకొట్టింది ఓ క్యాబ్ కారు. అతివేగంతో.. అజాగ్రత్తతో డ్రైవింగ్ చేశాడు కారు డ్రైవర్. ఈ తరుణంలోనే… కారు వెనుక చక్రం ఊడింది. ఇక ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేసి ఉంటాడనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. మెట్రో ఫిల్లర్ డివైడర్ ను ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడి ఉంది కారు. అయితే… ఈ సమచారం అందగానే… పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.