హైలురోనిక్ యాసిడ్ నిజంగానే వృద్ధ్యాప్యాన్ని తగ్గిస్తుందా..?

-

స్కిన్‌ స్కేర్‌ కోసం అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిలు తెగ ఆరాటపడుతుంటారు. అమ్మాయిలకు చర్మంపై శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది.. జుట్టు, ముఖం అన్నీ బాగుండాలనే అనుకుంటారు. బయటకు వెళ్తుంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని చేసినా.. ఒక ఏజ్‌ వస్తుంటే..మార్పులు రావడం స్టాట్‌ అవుతాయి.. అలా ముఖం మీద ముడతలు వచ్చేసి.. వృద్ధ్యాప్య ఛాయలు కనిపిస్తాయి.. ఇది కవర్‌ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు.. అయితే మార్కెట్‌లో ఇప్పుడు ఓ ట్రీట్మెంట్‌ పేరు బాగా వినిపిస్తుంది.. అదే హైలురోనిక్ యాసిడ్. ఇదొక యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్. సెలబ్రిటీలు కూడా దీన్నే వాడుతున్నామంటూ ప్రచారం చేయడంతో.. డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. మరి ఈ ఉత్పత్తి నిజంగానే అందాన్ని పెంచి.. వయస్సును తగ్గిస్తుందా.? అంతా ఉత్తుత్తేనా..?

హైలురోనిక్ యాసిడ్ అంటే ఏంటి?

హైలురోనిక్ యాసిడ్ అనేది గ్లైకోసమినోగ్లైకాన్. ఇదొక సహజ కార్బోహైడ్రేట్..స్కిన్ మెరిసేలా హైడ్రేట్‌గా కనిపించేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. వృద్ధాప్య సంకేతాలని నిరోధించడంలో బాగా పనిచేస్తుంది. మొటిమలు, వాటి వల్ల కలిగే మచ్చలు, గాయాలు నయం చేయడంలో అద్భుతంగా నిచేస్తుంది.

ఎందుకు అవసరం?

అసలైతే.. ఇది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది. అయితే చర్మంలో వయస్సు పెరుగుతున్న కొద్ది ఈ ఉత్పత్తి తగ్గిపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, నీరు తక్కువగా తాగడం, సాధారణ ఆహారపు అలవాట్లు వల్ల ఇది తగ్గిపోతుంది. ఫలితంగా చర్మంపై ముడతలు కనిపిస్తాయి. దీన్ని పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సరైన సమతుల్య పోషకాహారం తీసుకోవడం.

హైలురోనిక్ యాసిడ్ వల్ల ప్రయోజనాలు..

వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది
మాయిశ్చరైజింగ్, హైడ్రేటింగ్ ఇస్తుంది
గాయాలను నయం చేస్తుంది
ముడతలు లేని చర్మం
ముఖానికి రంగు వచ్చేలా చేస్తుంది
హైలురోనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని ఒక పరిశోధన వెల్లడించింది.
కాలుష్యం, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
చర్మం తేమగా ఉండేందుకు సహాయపడుతుంది. తేమ లేకపోవడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. దాన్ని తగ్గించేందుకు ఇది సహకరిస్తుంది.
కొన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మంలోకి వెళ్లలేవు. కానీ ఇది త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది. చికాకు కలిగించదు. అన్ని రకాల చర్మాల వారికి చక్కగా సరిపోతుంది.
ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటే అది ఏడాది పాటు ఉంటుంది. ఇది సహజంగా కరిగిపోతుంది. ఉదయం వేళ దీన్ని రాసుకుంటే మంచిదని చర్మ నిపుణులు సూచిస్తున్నారు.

హైలురోనిక్ యాసిడ్ వల్ల దుష్ప్రభావాలు..

చర్మ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. కానీ దీన్ని ఇంజెక్షన్ రూపంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి కొన్ని సమస్యలు కలిగిస్తుందని అంటున్నారు..హైలురోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ తీసుకుంటే..

 నొప్పి

ఎర్రగా మారడం

దురద

వాపు

గాయాలు కావడం జరిగే అవకాశం ఉంది..

చర్మ స్థితిని మార్చేందుకు ఇప్పుడు అనేక సీరమ్, క్రీమ్, మాయిశ్చరైజర్ లలో హైలురోనిక్ యాసిడ్ పదార్థాన్ని ఉపయోగిస్తున్నారు..వాటి ద్వారా ట్రే చేయడం బెటర్‌.. అసలు అన్నిటికంటే బెస్ట్‌ ఆప్షన్‌…వీటి మీద డబ్బులు పెట్టే బదులు, సిట్రస్‌ ఫ్రూట్స్‌ ఎక్కువగా తినడం, డ్రై ఫ్రూట్స్‌ తినడం, వాటర్‌ ఎక్కువగా తాగడం, జంక్‌ఫుడ్స్‌కు దూరంగా ఉండటం చేస్తే.. స్కీన్‌ సూపర్‌గా ఉంటుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version