వాస్తు: ధనవంతులు అవ్వాలంటే రహస్యం అద్దంలో వుంది తెలుసుకోండి..!

-

వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బంది అయినా సరే తొలగిపోతుంది. చాలా మంది అందుకే వాస్తు ప్రకారం ఫాలో అవుతూ వుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ వుంటారు. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనతో ధనవంతులు అవ్వాలంటే రహస్యం అద్దంలో వుంది అని అంటున్నారు. మరి దానికి సంబంధించి వివరాలని ఈరోజు తెలుసుకుందాం.

ప్రతి ఒక్కరి ఇంట్లో అద్దం ఉంటుంది. అద్దం వెనుక కూడా వాస్తు నడుస్తుందని పండితులు అంటున్నారు. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో పగిలిపోయిన అద్దాన్ని కానీ విరిగిపోయిన అద్దాన్ని కానీ ఉంచకూడదు దీని వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది నిజానికి ఇంట్లో ఉంటే అద్దం మన డెస్టినీని మార్చేస్తుంది కాబట్టి అజాగ్రత్త అద్దం విషయంలో పనికి రాదు అద్దం కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోండి.

సరైన దిక్కులలో అద్దాన్ని పెట్టకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి. చాలామంది ఇళ్లల్లో బెడ్రూంలో అద్దాన్ని పెడుతూ ఉంటారు బెడ్ రూమ్ లో అద్దాన్ని పెట్టేటప్పుడు మంచానికి ఎదురుగా ఎప్పుడూ అద్దం పెట్టకూడదు ఒకవేళ కనుక మంచం ఎదురుగా అద్దం పెడితే దానివలన లేని పోని సమస్యలు వస్తాయి. చాలా మంది చోటు సరిపోవటం లేదని మంచానికి ఎదురుగా అద్దం పెడుతూ ఉంటారు కానీ ఇది అసలు మంచిది కాదు. అద్దానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీరు మీ వాస్తుని పండితులని అడగండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version