ఈ ప్రకృతిలో దేన్నైనా ఆస్వాదించాలంటే కొంచెం భావుకత్వం ఉండాలి. అంటే దాన్ని భావించే మనస్తత్వం ఉండాలి. కాగితం పడవను నీటిలో వదులుతూ కేరింతలు కొట్టే పిల్లాడు ఎంత ఆనందిస్తాడో, జీవితంలో జరిగే ప్రతీ విషయంలోనూ అంతే ఆనందం ఉండాలి. లేదంటే జీవితం వృధా అయిపోతుంది. ఉన్నది ఒక్కటే జీవితం కాబట్టి ఆనందంగా గడపాలన్నదే ప్రాముఖ్యం. ఐతే ముందుగానే చెప్పినట్టు దానికి కొంచెం భావుకత్వం కావాలి.
ఆ భావుకత్వం శృంగారానికి కూడా అవసరం. శృంగారం అనగానే శరీర సంగమం అని అనుకోవద్దు. మీ భాగస్వామితో చేసే చిన్నపాటి అల్లరి, తుంటరి ముద్దు, గిల్లికజ్జాలు మొదలైనవన్నీ శృంగారంలో భాగమే. ఇలాంటి వాటిని అనుభవించడానికి రసాస్వాదన కావాలి. లేదంటే కొన్ని రోజులకి శృంగారం మీద కూడా బోర్ కొట్టే అవకాశం ఉంది. అమెరికాలో చాలామంది సెక్స్ పట్ల ఆసక్తి చూపట్లేదని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
శరీరానికి అవసరం అన్న ఉద్దేశ్యంతో చేసే శృంగారంలో ప్రేమ ఉండదు. ప్రేమ లేనపుడు ఏది సంతోషాన్ని ఇవ్వదు. అందుకే ప్రేమించండి. ఈ ప్రకృతిని, ప్రకృతి మీకిచ్చిన భాగస్వామిని. ప్రకృతిలో మమేకం అవ్వండి.
అందుకే మీ భాగస్వామితో ప్రతీ అనుభవాన్ని ఆనందించండి. అందులో చిన్నపాటి గొడవలు కూడా ఉండవచ్చు. అంతమాత్రాన ఆనందించడాన్ని ఆపవద్దు. అప్పుడే మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. మీ భాగస్వామితో చిన్న చిన్న విహారాలు, ఒక సినిమా, అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్, లేదంటే ఇద్దరికీ నచ్చిన ఫేవరేట్ హాలిడే స్పాట్. అది మీలోని భావుకుడిని బయటకు తీసి మిమ్మల్ని మరింత ఆనందంగా ఉంచేలా చేస్తుంది.