మేడ్చల్ జిల్లాలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల జర్నలిస్ట్ కాలనీ సమీపంలోని ఇండ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు బోరున విలపిస్తున్నారు. పదేళ్ల నుంచి ఉంటున్నాం. కనీసం చెప్పకుండా, సమయం కూడా ఇవ్వకుండా తమ ఇండ్లను కూల్చేశారని బాధితులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
అంతేకాకుండా, అడ్డువచ్చిన బాధితులను బైండోవర్ చేయాలని పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణాల కుల్చివేతలను చిత్రీకరిస్తున్న మీడియాపై బాచుపల్లి ఆర్.ఐ భానుచందర్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఇవన్నీ అక్రమ నిర్మాణాలుగా అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది.
మేడ్చల్ – నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఇళ్లను కూల్చేసిన అధికారులు
పదేళ్ల నుంచి ఉంటున్నాం. కనీసం చెప్పకుండా, సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారని కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు
అడ్డు వచ్చిన బాధితులను బైండోవర్ చేయాలని పోలీసులకు హుకుం జారీ చేసి..… pic.twitter.com/Nkrxd2q3Aq
— Telugu Scribe (@TeluguScribe) February 11, 2025