స్కూల్ నుంచి ఇంటికి వస్తూ అతనుండే సొసైటీ లిఫ్ట్ ఎక్కాడు ఓ బాలుడు. అప్పుడే అక్కడికి ఓ మహిళ తన పెంపుడు కుక్కతో వచ్చింది. అతడితోపాటే లిఫ్టులో ఎక్కింది. వెంటనే ఆ కుక్క బాలుడిపై ఎగబడి దారుణంగా కరిచింది. లిఫ్టులో ఉన్న ఆ శునకం యజమాని చోద్యం చూసింది కానీ ఆ బాలుడిని కాపాడలేదు. అతడు కాలును పట్టుకొని బాధతో విలవిల్లాడుతూన్నా.. ఆ మహిళ మాత్రం తనకేమీ పట్టనట్లు నిర్దయగా వ్యవహరించింది. బయటకు వెళ్లే సమయంలోనూ ఆ శునకం మరోసారి దాడికి యత్నించింది. ఈ సంఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని ఓ హౌజింగ్ సొసైటీలో చోటుచేసుకుంది.
ఈ వీడియోను అకాశ్ ఆశోక్ గుప్తా అనే ట్విటర్ యూజర్ ట్వీట్ చేస్తూ.. ఎవరూ చూడకపోతే నైతికంగా ఉండాల్సిన బాధ్యతలేదా? అంటూ ప్రశ్నించారు. కాగా ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు. ‘అనైతికం, సిగ్గుచేటు.. మానవత్వాన్ని మరిచిపోతున్నారు. బాలుడి బాధను పట్టించుకోని ఆమెను ఏమనాలి?’ అంటూ ఓ నెటిజన్ ఘాటుగా స్పందించాడు. ‘అలా వ్యవహరించిన ఆ జాలిలేని మహిళను శిక్షించాలి’ అంటూ మరికొందరు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఘజియాబాద్ పోలీసులు స్పందించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆ శునకం యజమానిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
a pet dog bites a kid in the lift while the pet owner keeps watching even while the pet owner the kid is in pain! where is the moral code here just cos no one is looking?
.
.
p.s: @ghaziabadpolice
Location: Charms Castle, Rajnagar Extension, Ghaziabad
Dtd: 5-Sep-22 | 6:01 PM IST pic.twitter.com/Qyk6jj6u1e— Akassh Ashok Gupta (@peepoye_) September 6, 2022