దొంగ‌త‌నం చేయ‌డం కూడా ఒక వ్యాధే.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌..

దొంగతనాలు చేయాలనే కోరిక బలీయంగా ఉండటం కూడా ఒక రకమైన మానసిక వ్యాధే. దీనిని క్లిప్టోమేనియా అని అంటారు. తనకు తెలీకుండానే తాను దొంగతనాలు చేయడం అనే దాన్ని క్లిప్టోమేనియా అంటారు.  దొంగతనం చేయడం తప్పని వీరికి తెలిసినప్పటికీ, పదేపదే ఆ కోరిక వీరిలో కలుగుతుంటుది. ఇంకా చెప్పాలంటే  రాజ్ తరుణ్ `రాజుగాడు` సినిమా చూసే ఉంటారు. అందులో రాజ్ త‌రుణ్ క్లిప్టోమేనియాతో బాధ‌ప‌డుతుంటాడు.

ఒకవేళ దానిని అణచుకోవడానికి ప్రయత్నిస్తే అసహనానికి గురవుతారు. క్లిప్టోమేనియా అనే వ్యాధి చిన్న వయస్సునుంచే ప్రారంభమవుతుంది. స్త్రీ, పురుషులిద్దరూ దీనికి సమానంగానే గురవుతారు. అయితే ఈ వ్యాధి అరుదుగా మాత్రమే క‌నిపిస్తుంది. పసితనంలోనే ఎందుకు దొంగతనాలకు అలవాటు పడతారనే విషయమై తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రవర్తన కూడా పిల్లలపై పడి వారు దొంగతనాలకు అలవాటుపడతారు.

అలాగే సినిమాలు, టివి కార్యక్రమాలు మొదలైన వాటి ప్రభావం కూడా పిల్లలపై పడి వారు దొంగతనాలకు పాల్పడేలా చేస్తాయి. ఇటువంటి సందర్భాలలో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి, సరిదిద్ది, సరైన మార్గంలోకి నడిపిస్తే చాలు. తీవ్ర మానసిక వత్తిడి కలిగించే అంశాలు క్లెప్టోమానియా సోకడానికి కారణమవుతాయి. ఉదాహరణకు ఆర్థికంగా నష్టపోవడం, ఆత్మీయులు దూరం కావడంలాంటి అంశాలు మానసిక వత్తిడికి కారణమవుతుంటాయి

ఈ విధంగా మానసిక వత్తిడికి లోనైనవారు క్లెప్టోమానియాకు గురి కావచ్చు. క్లెప్టోమానియాకు గురైన వారిలో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఫలితంగా డిప్రెషన్‌లోకి వెళ్లి ఆత్మహత్యలకు కూడా పాల్పడే అవకాశాలున్నాయి. క్లెప్టోమానియాకు గురైన వ్యక్తులకు మానసిక వైద్యుల వద్దకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. లేక‌పోతే చాలా ప్ర‌మాదాల‌కు గురి కావాల్సి వ‌స్తుంది.