అత్యంత కీలకమైన అంశం..నా మనసు విప్పి మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కాపాడాలి అంటే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలి అని జయప్రకాష్ నారాయణ అన్నారు. గత 5 ఏళ్ళు పాలనలో మంచి జరగలేదు. ఆర్థికంగా క్రుంగి పోయాము. మనము 9 లక్షల 74 వేల కోట్ల రూపాయల అప్పులలో కురుకుపోయాము. లక్ష 40 వేల కోట్లు పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది… దీనిలో సగం బకాయిలకు వడ్డీలా ద్వారా వెళ్ళిపోతుంది. జాతీయ స్థాయి స్తూల ఉత్పత్తి లో 60 శాతం వరకు వడ్డీల రూపంలో వెళ్ళిపోతుంది.
నిజానికి మనము అప్పుల కుప్పలో కురకుపోయాము. 100 లో 62 రూపాయలు వడ్డీ ల రూపం లో చెల్లెస్తున్నాము. మొత్తం ఆదాయం లో మూడింట రెండో వంతు వడ్డీలు వెళ్తున్నాయి. జీడీపీ లో తమిళనాడు 34 శాతం ఉంటే, తెలంగాణ 35,ఒరిస్సా 15 శాతం, మహా రాష్ట్రం 18 శాతం గా జీడీపీ గా ఉన్నాయి. గత 5 ఏళ్ళ కాలం లో ఎంతగా ప్రజా ధనాన్ని పట్టించుకోకుండ … బటన్ నొక్కే దానిపైనే దృటి పెట్టడంతో ఆర్థిక పరిస్థితి కుంటి పడింది. రాష్ట్రం పై పన్నుల భారం బాగా పెరిగింది అని జయప్రకాష్ నారాయణ తెలిపారు.