పదిమందిలో మీ వాల్యూ పెరగాలంటే అలవర్చుకోవాల్సిన అలవాట్లు ఇవే

-

నలుగురిలోకి వెళ్ళినపుడు ఒక మనిషికి విలువ ఇవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు ఆ మనిషికి ఉండాలి. అలవాట్లు ఏమీ అవసరం లేదు, డబ్బుంటే చాలని మీకు అనిపించవచ్చు. అది కూడా కరెక్టే. కానీ డబ్బున్నప్పుడు మీకు విలువిచ్చే జనం, అది మీ నుండి పోయాక మిమ్మల్ని పట్టించుకోరు. కాబట్టి మనీ మ్యాటర్ వదిలేసి.. మనిషి విలువ పెంచె లక్షణాలు ఏంటో చూద్దాం.

నిజాయితీ:

మీ మాటల్లో చేతల్లో నిజాయితీ లేకపోతే మీరు చెప్పేది అబద్ధమో నిజమో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి మీకు విలువ ఇవ్వడం జనాలు మానేస్తారు. అందుకే నిజాయితీ ముఖ్యం.

లక్ష్యాన్ని మరువని గుణం:

జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తుంటే ఉన్నత స్థానంలోకి ఎదిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ టార్గెట్ తో పనిచేసే వారిని చుట్టుపక్కల ఉన్నవారు గొప్పగా చూస్తారు.

కమ్యూనికేషన్:

బాగా మాట్లాడేవాళ్ళు ఎక్కడుంటే నలుగురు మనుషులు కూడా అక్కడే ఉంటారు. ఎదుటివారిని అట్రాక్ట్ చేయాలంటే మాటకారితనం కావాలి. నలుగురిలో ఎలా మాట్లాడాలో తెలిస్తే మీ వాల్యూ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.

జవాబుదారీతనం:

మొదటగా నిజాయితీ అనేది చెప్పుకున్నాం కదా.. ఇది కూడా దాని కోవలోకే వస్తుంది. తప్పయినా ఒప్పయినా అవతలి వాళ్ళకు సమాధానం ఇచ్చె విధంగా ఉండాలి.

వినయం:

ఇది ప్రధానమైనది. యారొగెంట్ గా అహంభావంతో ఉంటే నలుగురు మీ నుండి దూరం వెళ్ళిపోతారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version