రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం..!

ఇండియన్ రైల్వేస్ రైలు ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ట్రైన్ ప్యాసింజర్లకు కొత్త సేవలని ఇండియన్ రైల్వేస్ తీసుకు రానుంది. ఈ సర్వీసులని తీసుకు వచ్చినట్టు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…

ట్రైన్ ప్యాసింజర్లకు కొత్త సేవలని ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చింది. దీనితో చాలా మందికి ఊరట కలుగనుంది అని చెప్పచ్చు. అయితే మరి ఆ సర్వీసుల గురించి చూస్తే.. టూరిజం లక్ష్యంగా కొత్త ట్రైన్స్‌ను తీసుకు వస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ అన్నారు.

ప్రస్తుతం అయితే ఇండియన్ రైల్వేస్ ప్యాసింజర్, గూడ్స్ విభాగాల్లో రైళ్లను నడుపుతోందని, రానున్న కాలంలో భారత్ గౌరవ్ ట్రైన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపింది. అయితే ఈ మార్పు వలన చాలా మందికి రిలీఫ్ కలగనుంది అని తెలుస్తోంది.

అయితే ఈ ట్రైన్స్ భారతదేశ సంస్కృతిని, వారసత్వాన్ని సూచించేలా ఉంటాయని అన్నర్రు. ఇప్పటికే 3,033 కోచ్‌లను లేదా 190 ట్రైన్స్‌ను గుర్తించామని తెలియజేయడం జరిగింది. ఈ రైళ్లు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ప్రైవేట్, ఐఆర్‌సీటీసీ సంస్థలు ఈ ట్రైన్లను నడుపుతాయని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఒడిశా, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇలాంటి ట్రైన్స్‌పై ఆసక్తి చూపుతున్నట్టు తెలిపారు.