హైదరాబాద్ లో డేరా బాబాలు..తల్లికి వైద్యం పేరుతో కూతుళ్లపై అత్యాచారం

దొంగ బాబాల పేరుతో సమాజంలో ఎన్నో దుర్మార్గాలు జరగుతున్నాయి. మంత్రాల నెపంతో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా బాధితులను వాడుకుంటున్నారు. పోలీసులు, మీడియా ఎన్నోసార్లు హెచ్చిరిస్తున్నా.. ఎక్కోడోచోట ప్రజలు మోసపోతునే ఉన్నారు. వైద్యం పేరుతో దొంగ బాబాలు అమాయకులను నమ్మిస్తూనే ఉన్నారు. దేవుని పేరు చెప్పుకుని.. కామక్రీడలు ఆడుతున్న ఎందరో బాబాల బాగోతాలు బయటపడుతూనే ఉన్నారు. తాజా మరోఘటన రాజధాని హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దొంగబాబా చేతుల్లో ఇద్దరు మహిళలు అత్యాచారానికి గురైన ఘటన వెలుగులోకి వచ్చింది.

అత్యాచారం

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతానికి చెందిన బాబాలు మంత్రాల పేరుతో ఇద్దరు యువతులపై అత్యాాచారానికి పాల్పడ్డారు. తమ తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మంచిగా చేయించేందుకు కూతుళ్లిద్దరు ఎంతో ప్రయత్నించారు. తల్లి ఆరోగ్యం బాగు కాకపోవడంతో.. పాతబస్తీకి చెందిాన బాబాల గురించి తెలుసుకుని అతన్ని ఆశ్రయించారు. అయితే దొంగ బాబా తల్లి వైద్యం మరిచి.. ఇద్దరు కూతుళ్లపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇందులో ఒకరికి  విడాకులు ఇప్పించి అప్పటి నుంచి అత్యాచాారాని పాల్పడుతున్నడు దొంగబాబా. బాబానే కాకుండా అతని కుమారుడు కూడా సదరు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాబా సదరు కుటుంబాన్ని ఆర్థికంగా కూడా కుంగదీశాడు. బాబా ముసుగులో ఆ తండ్రీ కొడుకులు చేస్తున్న అరాచాకాలను బాధితులు బయటపెట్టారు. చాంద్రాయణ గుట్ట

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు బాబాలను పోలీసులు కటకటాల్లోకి పంపించారు.