జాబ్ కోసం సెర్చ్ చేయడం తేలికైన పని కాదు. ఒక్కోసారి దీనికి నెలలు నెలలు టైం పడుతుంది. అయితే కొన్ని జాబ్ సెర్చ్ టిప్స్ పాటిస్తే మీకు నచ్చిన జాబ్ తొందరగా దొరికే అవకాశం ఉంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం.
లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని అప్డేట్ చేయండి:
చాలామంది ఒక జాబ్ చేస్తున్నప్పుడు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ని మర్చిపోతుంటారు. ఎలాంటి అప్డేట్లు చేయరు. ఎప్పుడైతే మీరు జాబ్ కోసం సెర్చ్ చేయాలనుకున్నారో, అప్పుడే ప్రొఫైల్ ని అప్డేట్ చేయండి. ఎందుకంటే చాలామంది రిక్రూటర్లు లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది.
కవర్ లెటర్ ముఖ్యం:
మీరు అప్లై చేసే ప్రతీ జాబ్ కి ప్రత్యేకమైన కవర్ లెటర్ రాయండి. ఆ కవర్ లెటర్ లో మీ స్కిల్స్ కచ్చితంగా మెన్షన్ చేయాలి. కవర్ లెటర్ పగడ్బందీగా ఉంటే రిక్రూటర్లు మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు.
స్కిల్స్ పెంచుకోండి:
ప్రపంచం రోజురోజుకూ కొత్తగా మారుతోంది. కొత్త కొత్త టెక్నాలజీ పుడుతోంది. కాబట్టి మీరు ఎంచుకున్న రంగంలో కొత్త టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు చేయండి. వాటిని మీ ప్రొఫైల్ కి యాడ్ చేయండి.
వేరువేరు ప్లాట్ఫామ్ లలో జాబ్ సర్చ్:
ఎప్పుడైనా సరే ఒకే జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ మీద నమ్మకం పెట్టుకోకండి. వేరువేరు ప్లాట్ఫామ్ లలో రిజిస్టర్ అవ్వండి. అలా చేస్తేనే మీరు ఎక్కువ మంది రిక్రూటర్స్ కి కనిపించే అవకాశం ఉంది.
వెబినార్స్ అటెండ్ అవ్వండి:
మీరు ఏ ఇండస్ట్రీలో జాబ్ చేయాలని అనుకుంటున్నారా ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వెబైనార్స్ అటెండ్ అవ్వండి. దీనివల్ల మీ నెట్వర్క్ పెరుగుతుంది.