దోమలు ఎంత ఎత్తు వరకూ ఎగురుతాయి..? ఏ ఫ్లోర్‌లో ఉంటే దోమల బెడద ఉండదు..

-

ఇళ్లు ఎంత నీట్‌గా పెట్టుకున్నా కొన్ని దోమలు అయితే అందరి ఇళ్లల్లో ఉంటాయి.. అసలు దోమలు లేకుండా ఉండాలంటే.. మనం ఏ ఫ్లోర్‌లో ఉంటే బెటర్‌.. దోమల సైజు చిన్నగా ఉంటుంది. అవి ఎంత ఎత్తు వరకూ ఎగరగలుగుతాయి..? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా..? నీటి కాలువలు, మురికి కాలువలు పక్కన నివసించేవారికి దోమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కాగానే దోమలు గుంపులుగా వచ్చి దాడి చేస్తాయి. ఐతే.. అదే ఏరియాలో ఉండే కొంతమందికి దోమల సమస్యే ఉండదు. అందుకు కారణం వారు ఎత్తైన ప్రదేశంలో ఉండటమే.

 

దోమలు.. కొన్ని కిలోమీటర్ల దూరం ఎగరగలవు. కానీ ఎగరవు. అవి నీటిపై గుడ్లు పెడతాయి. దాన్ని ఓ కాలనీగా భావిస్తాయి.. అవి తమ కాలనీ నుంచి కొన్ని వందల గజాల దూరం మాత్రమే వెళ్తాయి. గుడ్లు పెట్టిన కాలనీకి దూరంగా ఉన్న ఇళ్లలోకి దోమలు వెళ్లే అవకాశాలు తక్కువ. ఆ ఇళ్లలో నీరు స్టాక్ ఉంటే.. దోమలు అక్కడే గుడ్లు పెట్టి అక్కడ కూడా వ్యాపిస్తాయి.

దోమలు పైకీ, కిందకూ ఎలాగైనా ఎగరగలవు. అవి ఎక్కువగా పైకి ఎగిరేందుకు ఇష్టపడవు. వీలైనంతవరకూ నేలకు దగ్గరగానే ఎగురుతాయట. అందువల్ల అపార్ట్‌మెంట్లలో.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వారికి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. థర్డ్, ఫోర్త్ ఫ్లోర్ వారికి తక్కువగా ఉంటుంది. అంతకంటే పైన ఉండేవారికి దాదాపు దోమల సమస్య ఉండదు..

దోమల సమస్య ఉండకూడదంటే..

వారికి దగ్గర్లో ఎక్కడా నీరు స్టాక్ ఉండకూడదు. అంటే కాలువల లాంటివి, నీటి ప్రవాహాల లాంటివి ఉండకూడదు. ఓపెన్ ట్యాంకుల్లో నీరు స్టాక్ ఉండకూడదు. ఇళ్లలో కూడా బకెట్లలో నీరు రోజుల తరబడి స్టాక్ ఉంచకూడదు. అలాగే… వారు ఎత్తైన ఫ్లోర్లలో ఉండేందుకు ప్రయత్నించాలి.

దోమల్ని తరిమేసేందుకు రీఫిల్స్, కాయిల్స్, స్టిక్స్, బ్యాట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ దోమలతోపాటూ.. మనకూ అనారోగ్యకరమే. వీటిని వాడే బదులు.. దోమలకు దూరంగా ఉండే ప్రదేశాల్లో నివసించేందుకు ప్రయత్నించండి. ఇంటి చుట్టూ మెష్‌ ఏర్పాటు చేసుకోవచ్చు.. ఐదో ఫ్లోర్ కంటే పైన నివసించడం మేలు. అలాంటి ఫ్లోర్లలోకి గాలి బాగా వస్తుంది. అందువల్ల దోమల సమస్య దాదాపు ఉండదు. అయితే అంత ఎత్తులో ఉండటం వల్ల వేరే సమస్యలు కూడా ఉంటాయి..ఇక అది మీ ఛాయిస్‌..!

Read more RELATED
Recommended to you

Exit mobile version