ప్రతిరోజు ఎన్నో సందర్భాలలో చాలా మందితో మాట్లాడటం సహజమే. అయితే అడిగిన ప్రతి ఒక్కరూ నిజాలు చెప్తారు అని అనుకుంటే పొరపాటే. చాలా మంది సందర్భానికి తగినట్టుగా అబద్దాలను చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే నిజాయితీగా మాట్లాడుతారో ఎలాంటి లక్షణాలు కనబడవు. అదే ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నట్లయితే శరీరంలో చాలా మార్పులను గమనించవచ్చు, చాలా శాతం మంది అబద్దాలను చెప్పేటప్పుడు చెమటలు పట్టడం వంటివి కూడా కనబడతాయి. ఎందుకంటే అబద్దాలు చెప్పడం వలన ఒత్తిడికి గురై శారీరకంగా అస్థిరత ఏర్పడుతుంది దీంతో అనేక మార్పులు ఏర్పడతాయి.
కేవలం మాట తీరుతో మాత్రమే కాకుండా ఇతరుల బాడీ లాంగ్వేజ్ ద్వారా కూడా అబద్ధం చెప్పినప్పుడు కనిపెట్టవచ్చు. ముఖ్యంగా ఎదుటివారు అబద్ధాలు చెబుతున్నప్పుడు ఎంతో గందరగోళానికి గురవుతారు మరియు దానిని వెంటనే కనిపెట్టవచ్చు. అంతేకాకుండా అబద్ధం చెప్పినప్పుడు ఎంతో త్వరగా మాట్లాడతారు లేక చాలా నెమ్మదిగా మాట్లాడుతారు. ఈ విధంగా స్వరంలో మార్పులు అనేవి ఎంతో సులువుగా కనిపిస్తాయి. ఇలా జరుగుతున్నప్పుడు నాడిని చెక్ చేస్తే వెంటనే అర్థమవుతుంది. ఎప్పుడైతే అబద్దాలను దాచడానికి ప్రయత్నిస్తారో అప్పుడు ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది.
ఒక చిన్న విషయానికి ఎక్కువ సేపు మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా వివరంగా చెప్పడం వలన అది అబద్ధం అని సులభంగా తెలుసుకోవచ్చు. అబద్ధాలు చెబుతున్నప్పుడు కంటి చూపును పక్కకి తిప్పి మాట్లాడుతారు లేఖ కిందకి చూసి మాట్లాడుతారు. ఎందుకంటే నేరుగా కళ్ళ వైపు చూస్తూ మాట్లాడితే అబద్ధాలను చాలా శాతం మంది చెప్పలేరు. కొంతమంది అబద్ధాలను చెబుతున్నప్పుడు వారి ముఖం, ముక్కు, చెవులు లేక మెడను తాకుతూ ఉంటారు. అబద్ధం చెప్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి కారణంగా స్పష్టంగా చెప్పలేరు ఈ విధంగా ముఖం ను తాకుతూ మాట్లాడతారు.