పోక్సో కేసులో కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పకు బిగ్ రిలీఫ్ లభించింది. ఫిబ్రవరి 2024లో తన నివాసంలో 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి యడ్యూరప్పపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈకేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, పోక్సో కేసును కొట్టివేయడానికి మాత్రం కోర్టు నిరాకరించినట్లు తెలిసింది.కాగా, కర్ణాటక సీఎంగా ఆయన తప్పుకున్నాక యడియూరప్పకు పొలిటికల్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి.ఆ తర్వాత ఆయనకు కేంద్రం నుంచి పదవులు వరించినా వయసు రీత్యా పదవులను ఆయన వదులుకున్న విషయం తెలిసిందే.