కోకో కోలా డ్రింక్ ని మీ దుస్తుల పై పడిన రక్తపు మరకలను తొలగించడానికి ఉపయోగిస్తే… అది బాగా సహాయ పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా రక్తపు మరకలను తొలగించాలంటే ఇలా చెయ్యండి. అలానే గ్రీజు వంటి మరకలను కూడా తొలగించడంలో ఇది బాగా సహాయపడుతుంది. లోహపు వస్తువులకు పట్టే తుప్పును వదిలించడంలో కూడా ఈ డ్రింక్ ని ఉపయోగించొచ్చు. టాయిలెట్ సీట్ పై కోలా డ్రింక్ పోసి కొంచెం సేపు అయ్యాక ఫ్లష్ చేసి శుభ్రం చేస్తే, టాయిలెట్ శుభ్రమవుతుంది. అంతే కాదండి కీటకాలు, పురుగులపై కోలా డ్రింక్ ను స్ప్రే చేస్తే అవి చనిపోతాయి.
కార్ బ్యాటరీ టర్మినల్స్ పై కోలా డ్రింక్స్ ను పోసి వాటిని శుభ్రం చేసుకోవచ్చు. మీ ఇంట్లో టైల్స్ మీద కూడా డ్రింక్స్ తో శుభ్రం చేసుకోవచ్చు. మాడిపోయిన సామాన్లని శుభ్రం చేసుకోవడానికి కూడా కూల్ డ్రింక్ ని ఉపయోగించవచ్చు. ఇది ఇలా ఉంటె కూల్ డ్రింక్ అనేది చాలా ప్రమాదమని నిపుణులు అంటున్నారు. కూల్ డ్రింక్ లో కలిపే యాసిడ్ వాహనాల బ్యాటరీ యాసిడ్ కు ఒకే పవర్ కలిగి ఉంటుంది. కనుక ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి వీలైతే వీటికి దూరంగా ఉంటె మంచిది.