కవలలు ఎలా పుడతారు? ఎటువంటి దంపతులకు పుడతారు?

-

ఆ సమయంలో కవలలు పుడతారు. అయితే.. రెండు వేర్వేరు అండాలు… రెండు వేర్వేరు శుక్రకణాలు కాబట్టి.. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పుట్టే అవకాశం ఉంటుంది.

కవలలు.. అంటే ఒకే కాన్పులో ఇద్దరు పిల్లలు లేదా అంతకంటే ఎక్కువ పుట్టడం. వాళ్లు ఒక ఆడ, ఒక మగ కావచ్చు.. ఇద్దరు ఆడ కావచ్చు.. ఇద్దరు మగ కావచ్చు. కవలలు అందరికీ పుట్టరు. కావాలనుకుంటే పుట్టరు. దానికి ఓ లెక్క ఉంటుంది. అందరు దంపతులకు కూడా ఇది సాధ్యం కాదు. కొందరికే సాధ్యం.

ఒక్క గర్భాశయంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఎలా తయారవుతారు. అది కూడా అరుదుగా ఎలా జరుగుతుంది? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? ఇటువంటి విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా? పదండి.. కవలల కథాకామీషు ఏంటో తెలుసుకుందాం..

అసలు పిల్లలు పుట్టాలంటే కావాల్సింది ఏంటి? ఆడవారి నుంచి విడుదలయ్యే అండం, మగవాళ్ల నుంచి విడుదలయ్యే శుక్రకణం. ఈ రెండు ఫలదీకరణం చెందడం వల్లనే పిండం తయారవుతుందని తెలుసు కదా. ఇంకాస్త లోతుకు వెళ్తే.. ఆడవాళ్లకు నెలకు ఒక అండం మాత్రమే విడుదలవుతుంది. అండం విడుదల అయిన సమయంలో వీర్యకణాలు అండంతో ఫలదీకరణం చెందుతాయి. అయితే.. కొంతమంది ఆడవాళ్లకు ఒక్కోసారి రెండు అండాలు విడుదలవుతాయి. ఆ రెండు అండాలు రెండు వేర్వేరు వీర్యకణాలతో ఫలదీకరణం చెందుతాయి. ఆ సమయంలో కవలలు పుడతారు. అయితే.. రెండు వేర్వేరు అండాలు… రెండు వేర్వేరు శుక్రకణాలు కాబట్టి.. ఒక ఆడ ఒక మగ, ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పుట్టే అవకాశం ఉంటుంది.

మరి ఇద్దరికంటే ఎక్కువ పిల్లలు ఎలా పుడతారు?

ఏంలేదు.. రెండు అండాలు విడుదలయితే ఇద్దరు పిల్లలు.. రెండు కంటే ఎక్కువ అంటే మూడు అండాలు విడుదలయితే.. ఆ మూడు అండాలు.. మూడు వీర్యకణాలతో ఫలదీకరణం చెందితే ముగ్గురు పిల్లలు పుడతారు. ఇలా ఎన్ని అండాలు ఫలదీకరణం చెందితే అంతమంది పిల్లలన్నమాట.

ఒకే పోలికతో ఎలా?

ఒకే పోలికతో ఎలా పుడతారు అంటే… అందరు కవలలు ఒకే పోలికతో ఉండరు. రెండు వేర్వేరు అండాల ద్వారా ఏర్పడిన పిండాలకు ఒకే రూపు తక్కువగా ఉంటుంది. కానీ.. అండం ఫలదీకరణం చెందినా రెండు భాగాలుగా విడిపోతుంది. అంటే అండం ఒకటే.. కానీ అది రెండు భాగాలుగా విడిపోవడం వల్ల ఇద్దరు పిల్లలు ఒకే రూపంతో పుడతారన్నమాట.

ఎటువంటి దంపతులకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ?

కుటుంబంలో ఇది వరకు ఎవరికైనా కవలలు పుట్టి ఉంటే.. తర్వాత తరాల వారికి కూడా కవలలు పుట్టే అవకాశం 29 శాతం ఉంటుంది.

అమెరికా, ఆఫ్రికా లాంటి దేశాల్లో కవల పిల్లలు ఎక్కువగా పుడతారు. 1000 మంది పిల్లల్లో 37 మంది కవలలే. ఇతర దేశాల్లో ప్రతి 1000 మందికి 32 గా ఉంది.

మహిళల వయసు 35 దాటిన తర్వాత పిల్లలను కనాలనుకునేవారికి కవలలు పుట్టే చాన్స్ ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. 35 సంవత్సరాలు దాటిన వారిలో విడుదలయ్యే అండాల నాణ్యత ఎక్కువగా ఉంటుందట. అంతే కాదు.. వారికి రెండు అండాలు విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయట.

బీఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉండే మహిళలకు కవల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

చాలారోజుల పాటు పిల్లలు పుట్టకుండా రకరకాల పద్ధతులు పాటించిన వాళ్లు.. ఒకేసారి వాటిని ఆపేసి పిల్లల కోసం ప్లాన్ చేస్తే అండాలు రెండు కానీ అంతకంటే ఎక్కువ విడుదల అవుతాయట. అటువంటి వాళ్లకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంటుందట.

ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే మహిళల్లో, మల్టి విటమిన్ టాబ్లెట్లను అధికంగా వేసుకునే వారిలో.. డెయిరీ ఉత్పత్తులను ఎక్కువగా తీసుకునే మహిళలకు కవలలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version