కుక్క కరిస్తే.. రూ. 10వేల ఫైన్..! వచ్చే ఏడాది నుంచే అమల్లోకి..

-

కుక్కలను పెంచటం అనేది ఈరోజుల్లో చాలామందికి అలవాటుగా మారింది. అయితే కుక్కలను పెంచేవాళ్లకు ఆ కుక్క అలవాటు కాబట్టి..అవి వారిని ఏం చేయవు.. కానీ వేరేవాళ్లు వచ్చారా.. ఇళ్లు పీకి పందిరి వేస్తాయి. కొన్నిసార్లు కరుస్తాయి కూడా. ఇలా కుక్కల దాడిలో గాయపడిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు..ఆ కుక్కల యజమానులు అయ్యయ్యే అంటారేతప్ప ఏం చేయరు. నోయిడాలో కొత్త పాలసీ అమలులోకి రానుంది. పెంపుడు కుక్కలు, పిల్లులు ఇతరులపై దాడి చేస్తే యజమానులు జరిమానాతో పాటు మరిన్ని చర్యలు ఎదుర్కోవాల్సి ఉండనుంది. నోయిడా అథారిటీ ఈ కొత్త పెట్ పాలసీని తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇవే.

కుక్కలు లేదా ఏ జంతువును పెంచుకుంటున్నా.. యజమానులు తప్పకుండా వాటి వివరాలను కచ్చితంగా రిజిస్టర్ చేయించుకోవాల్సిందేనని నోయిడా అథారిటీ మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 31లోగా నమోదు చేయించుకోవాలని వెల్లడించింది. ఒకవేళ పెంపుడు కుక్క లేదా పిల్లి వల్ల ఇతరులకు గాయాలైతే రూ.10వేల జరిమానా విధించనుంది.

యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) మార్గదర్శకాల అనుగుణంగా 207వ బోర్డు సమావేశంలో నోయిడా అథారిటీ బోర్డ్ ఈ నూతన పెట్ పాలసీకి ఆమోదం తెలిపింది.

నోయిడా అథారిటీ తీసుకొచ్చిన కొత్త పెట్ రూల్స్ ఇవే..

నోయిడా అథారిటీ కొత్త పాలసీ ప్రకారం, 2023 జనవరి 31 లోగా పెంపుడు జంతువుల యజమానులు వాటిని తప్పకుండా రిజిస్టర్ చేయించాలి. లేకపోతే నమోదు చేయించనందుకు ఫైన్ కట్టాలి..
పెంపుడు జంతువుల వల్ల ఎవరికైనా గాయాలైతే యజమానులు రూ.10వేల ఫైన్ చెల్లించాలి.
2023 మార్చి 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది.
పెంపుడు జంతువు వల్ల గాయపాలైన వ్యక్తి/ జంతువు చికిత్సకు అయ్యే ఖర్చులు కూడా యజమానులే భరించాలి.
పెంపుడు కుక్కలకు తప్పకుండా యాంటీ రేబిస్ వాక్సినేషన్ చేయించాలి. ఈ నిబంధన ఉల్లంఘిస్తే ప్రతీ నెల రూ.2వేల జరిమానాను ఓనర్స్ చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా ఎందుకంటే..

పెంపుడు కుక్కలు ప్రజలపై దాడులు చేస్తున్న సంఘటనలు నోయిడాలో ఇటీవల విపరీతంగా పెరుగుతున్నాయి. బయటి ప్రాంతాల్లో పెంపుడు జంతువులకు కొందరు యజమానులు విచ్చలవిడిగా ఆహారం తినిపిస్తుండడం ఇందుకు ఓ కారణమని తెలుస్తోంది. నోయిడాలోని ఓ గేటెడ్ కాలనీలో గత నెల ఓ శునకం దాడి చేసి ఏడు నెలల శిశువును చంపేసింది. ఇటీవలే మూడేళ్ల పిల్లాడిని ఓ కుక్క గాయపరిచింది. ఓ సెక్యూరిటీ గార్డును ఓ శునకం కరిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో నోయిడా అథారిటీ కొత్త పెట్ పాలసీని తీసుకొచ్చింది. అలాగే బయటికి తీసుకొచ్చినప్పుడు వాటిని నియంత్రించడంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నోయిడా అథారిటీ ఈ నిర్ణయాలు తీసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version