రోడ్డుపై కనిపించే వస్తువులకు కక్కుర్తి పడ్డారో.. ఖతం అంతే..

-

మనుషులు రాను రాను దారుణంగా తయారు అవుతున్నారు.. ఫ్రీగా వస్తున్నాయి అంటే ఫినాయిల్ ను కూడా వదలరు..ఇలాంటి చిన్న చిన్న వాటిని టార్గెట్ చేస్తూ కొందరు దొంగలు రచ్చ చేస్తున్నారు.కొన్ని రోజులుగా దొంగలు హల్ చల్ చేస్తున్నారు.రోజుకోకొత్త విధానంలో దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు గుట్టుచప్పుడు కాకుండా, యజమానులకు తెలియకుండా దోచుకుంటున్నారు.

తాజాగా ఇందుకు సంబంధించిన ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వెలుగు చూస్తున్నాయి. దోపిడీ దొంగలు కొత్తరకం దోపిడీకి తెరలేపారు. ప్రజల ఆశను ఆసరగా మార్చుకుని, నిలువునా దోచేస్తున్నారు.నైట్ ఫోన్ లైట్ ఆన్ చేసి రోడ్డు పక్కన కింద పడేస్తారు. ఆ తరువాత.. తమ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు కేటుగాళ్లు. ఎందుకంటే.. ఈ టార్చ్ లైట్ వేసి ఉండటం వల్ల ఫోన్ ఉందని భావించి చాలా మంది తమ వాహనాలను రోడ్డు పక్కన నిలుపుతున్నారు.

అలా ఆ ఫోన్ తీసుకుందామని అనుకునేలోపు.. ఆ పక్కనే మాటు వేసి ఉన్న దుండగులు.. సదరు వ్యక్తులపై అటాక్ చేసేస్తున్నారు. విలువైన నగదు, వస్తువులు, మొబైల్స్, పర్స్‌లు కాజేస్తున్నారు.అలా లైట్ ఆన్ చేసి ఉన్న మొబైల్స్ పై జనాలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు..

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version