మన పెద్దోళ్లు మనకు చాలా కండీషన్స్ పెడతారు. ఇంట్లో గోళ్లు కత్తిరించవద్దు, లైట్స్ వేశాక ఇళ్లు ఊడ్చకూడదు, కుర్చోని కాళ్లు ఊపొద్దు..అబ్బో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్ట్ ఉంది. వీళ్లు వద్దు అంటారు.. ఎందుకు అంటే అరిష్టం అంటారు కానీ..అసలు ఏంటి కారణం అని చెప్పలేరు. ఎందుకంటే.. అది వారికి వాళ్ల పెద్దోళ్లు చెప్పారు.. రీజన్ వీరికి కూడా పెద్దగా తెలియదు. అలాంటిది రాత్రిపూట చెట్లకింద నిద్రపోవద్దు అనేది కూడా. అమ్మో దీనికి అయితే ఏకంగా..రాత్రిపూట చెట్ల కింద దెయ్యాలు ఉంటాయి. నిద్రపోతే అవి మనకు పడతాయి అని భయపెట్టే వాళ్లు. మళ్లీ అదే చెట్టు కింద ఉదయం పడుకోవచ్చు.. హాయిగా ఉంటుందంటారు. అసలు ఇదెక్కడి లాజిక్‌కో..! ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే.. రాత్రిపూట చెట్ల కింద ఎందుకు నిద్రపోకూడదు..? ఒక్క నిమిషం ఆలోచించండి..! ఏమై ఉండొచ్చు….ఏం తట్టలేదా.. అయితే సైంటిఫిక్ రీజన్ ఏందో చూడండి..!
రాత్రిపూట చెట్ల కింద నిద్ర పోకూడదని.. దెయ్యాలు భూతాలు మనం రాత్రి చెట్ల కింద ఉంటే తినేస్తాయని కాదు. నిజానికి ఇలాంటి పిచ్చి భయాలు పెట్టుకోకండి. రాత్రి సమయంలో చెట్ల కింద నిద్రపోకూడదని చెప్పడం వెనుక ఒక అర్థం ఉంది. రాత్రిపూట చాలా చెట్లు కార్బన్ డయాక్సయిడ్ విడిచి ఆక్సిజన్ గ్రహిస్తాయి. కాబట్టి.. మనము చెట్ల కింద నిద్రపోకూడదు. నిద్రలో కూడా మనకు ఆక్సీజన్ అవసరం.. కానీ ఇలా చెట్లు ఆక్సీజన్ తీసుకుని కార్భన్‌డయాక్సైడ్‌ను వదిలితే.. అది మనకు ఇబ్బందే కదా.. అందుకే మన పెద్దోళ్లు చెట్ల కింద నిద్రపోవద్దు అని రూల్ పెట్టుకున్నారు. చెట్లు శ్వాస తీసుకునేందుకు ఆకులకి ఉండే సూక్ష్మ రంధ్రాలను ఉపయోగిస్తూ ఉంటాయి. దాన్నే స్టోమెటా అని కూడా అంటారని మనకి తెలిసిందే.
సో.. మోరల్ ఆఫ్ దీ స్టోరీ అంటే..పెద్దోళ్లు చెప్పే వాటికి వెనుక రీజన్స్ ఉంటాయి.. కానీ అవి పాపం వారికి కూడా తెలియదు.. మీరు చేయాల్సింది ఏంటంటే..వాళ్లు చెప్పే వాటికి సైంటిఫిక్ రీజన్స్ కనుక్కోవడం..క్రేజీగా ఉంటుంది స్టాట్ చేయండి.!
చెట్ల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. చెట్ల వల్ల మనకి ఆక్సిజన్ మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. నిజానికి చెట్లు లేక పోతే మన జీవితం ఉండదు. మనుషులకు మాత్రమే కాకుండా చెట్లు పక్షులకి, జంతువులకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. కొన్ని రకాల జంతువులు చెట్ల ఆకులను కోసుకుని తింటూ ఉంటాయి. మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి..