రైతులకు శుభవార్త.. ఇవాళే పీఎం కిసాన్‌ 12వ విడత నిధుల విడుదల

-

దేశంలోని రైతులందరికీ మోడీ సర్కార్‌ అదిరిపోయే తీపి కబురు చెప్పింది. రైతులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న స్కీముల్లో ప్రధాని మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఒకటి. రైతులకు రూ. 6000 ఈ స్కీమ్ ద్వారా అందిస్తోంది. అయితే, రైతుల ఖాతాల్లోకి మరోసారి నగదు బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైంది.


పీఎం కిసాన్ పథకం కింద 12వ విడత నిధులు విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన పీఎం కిసాన్ సమ్మన్ సమ్మేళన్ 2022 సదస్సును ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశం వేదికగా ప్రధాని మోదీ 12వ విడత కిసాన్ సమ్మన్ స్కీము నిధుల పంపిణీ ప్రారంభిస్తారు. ఆ వెంటనే ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులందరికీ ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. అంటే ఇవాళ్టి నుంచి వారం రోజుల పాటు రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version