ఇండియాలో పోర్న్ చూస్తున్నారా… అమెరికానుంచి సమాచారం వస్తోంది!

-

ఇంట్లో ఎవరులేరనో.. స్మార్ట్ ఫోన్ ను ఎవరూ చూడటం లేదనో.. కాస్త ఫ్రీగా ఉన్నారనో.. ఈ మధ్యకాలంలో చాలా మంది చేసే పని “పోర్న్” చూడటం! ఇదొక రెగ్యులర్ వర్క్ గా మారిపోతుంది. విచిత్రం ఏమిటంటే… ఆడవాళ్లు సైతం ఈ అశ్లీల వీడియోలను చూస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అయితే… ఇకపై వీటిని ఆపాలి.. ఆపితీరాలి!

పోర్న్ చూశాక మృగాళ్లు రెచ్చిపోతున్నారు.. వావి వరసలు మరుస్తున్నారు.. పసిపిల్లలని కూడా చూడకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.. ఆ పసికందుల జీవితాలను చిదిమేస్తున్నారు.. వికృతచేష్టలతో తమ కామవాంచ తీర్చుకుంటున్నారు. దేశంలో జరుగుతున్న అనేక అత్యాచారాలకు.. మృగాడి మానసిక స్థితి ఎంత కారణమో, మత్తుపదార్థాల మైకం మరెంతకారణమో.. అదే స్థాయిలో అశ్లీల వీడియోలు చూడటం కూడా అంతే కారణం! దీంతో… తాజాగా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 16మందిపై హైదరాబాద్ సీపీఎస్ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఈ విషయంలో అమెరికా వ్యవహరిస్తోన్న వైఖరి… చైల్డ్ పోర్నోగ్రఫీ చూసే వ్యక్తుల పాలిట సింహస్వప్నంలా మారింది. అవును… ఇండియాలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే.. అమెరికన్ ఏజెన్సీ ఇట్టే పసిగడుతుంది. ఐపీ అడ్రస్ ఆధారంగా వివరాలు సేకరించి భారత ఎన్సీఆర్బీకి పంపుతోంది. ఆ వివరాలను సంబంధిత రాష్ట్రాల సైబర్ క్రైమ్ పోలీసులకు భారత ఎన్సీఆర్బీ అందజేస్తోంది.

సరిగ్గా ఇలానే 16మందికి సంబంధించిన లింక్స్ ను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో.. సీఐడీ విభాగానికి సెండ్ చేసింది. దీంతో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన 16మంది ఐపీ అడ్రస్ లను సేకరించి సీసీఎస్ లో సీఐడీ ఫిర్యాదు చేసింది. దీంతో… సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాబట్టి… వికృత ఆలోచనలు చేస్తూ… చిన్నపిల్లలతో కూడిన అశ్లీల నీలిచిత్రాలను అప్ లోడ్ చేసినా.. డౌన్ లోడ్ చేసినా.. వీక్షించినా.. ఒకరోజు అటో ఇటో.. మీరు జైలుకు వెళ్లడం ఖాయం!

– CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version