ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్నిసార్లు అసలు వీటి వల్ల ఏం ఉపయోగం అని మనం అనుకుంటాం. కానీ మొక్కలు, పక్షులు, జంతువులు, మనుషులు ఇవన్నీ ఈ భూమ్మీదనే జీవిస్తున్నాయి. ఒకదానితో ఒకదానికి అవసరం ఎంత వరకూ ఉందనేది పక్కనపెడితే.. దేనికి అదే గొప్పనే. పక్షులను చూసి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. కొన్ని పక్షుల జీవనశైలి, వాటి అలవాట్లు చాలా విచిత్రంగా ఉంటాయి. కాకి గురించి మీకు తెలియని ఇంట్రస్టింగ్ ప్యాక్ట్స్.. దీన్ని చూసి మనిషిగా మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది.!
మొండితనం.. అవును కాకి చాలా మొండి పక్షి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్నది సాధిస్తుంది. అదేవిధంగా జీవితంలో పట్టుదలతో ఉండి, తన లక్ష్యాన్ని సాధించేందుకు పగలు, రాత్రి కష్టపడితే కచ్చితంగా జీవితంలో జయించగలరు.
ఎవరినీ పూర్తిగా నమ్మకూడదని కాకి జీవితం చెబుతుంది. కాకి ఎవరినీ అంత తేలికగా నమ్మదట. మీరు సురక్షితంగా, మీ చుట్టు పక్కల పరిశీలిస్తూ ఉండాలి. ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియదు. మానవులు కూడా పూర్తిగా ఎవరినీ నమ్మకూడదు. ఎవరినైనా నమ్మి ఆలోచించకుండా దిగితే మోసపోయే అవకాశాలు ఎక్కువ. ఇవన్నీ చెబితే అర్థంకాదు.. అనుభవాలు నుంచే నేర్చుకుంటే బాగా తెలుస్తుంది కదా.! ఎవరినైనా విశ్వసించే ముందు, వారిని క్షుణ్ణంగా పరిశోధించాలి.
ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. కాకి ఎక్కడ ఉన్నా చాలా జాగ్రత్తగా కూర్చోవడం తరచుగా చూసి ఉంటారు. కాకి భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేయగలదు. కాకి ఎక్కడి నుంచి ప్రమాదం వస్తుందో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటుంది. మనిషి కూడా తన పరిసరాల గురించి తెలుసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి.
కాకి చాలా దూరదృష్టి గల పక్షి. ఇది ముందుగానే ఆహారాన్ని సేకరించి, కరువు సమయం కోసం నిల్వ చేసుకుంటుంది. వర్షం పడినప్పుడో, ఆహారం దొరకనప్పుడో ఆ ఆహారాన్ని ఉపయోగిస్తుంది. ప్రతి మనిషి ఈ పద్ధతిని పాటించాలి. భవిష్యత్తు గురించి ఆలోచించండి. జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా, ఒక వ్యక్తి తన పనిని సమయానికి లేదా అంతకంటే ముందే పూర్తి చేస్తే, వారు చివరి నిమిషం వరకు కష్టపడాల్సిన అవసరం లేదు.
జీవితంలో సహనం చాలా ముఖ్యం. సహనం మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. కాకి కూడా చివరి క్షణం వరకు ఓపికగా కూర్చుని సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగుతుంది. సృష్టిలో నేర్చుకునేందుకు చాలా అంశాలు ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ప్రతీ దాన్ని పరిశీలిస్తూ ఉండాలి.ఇవన్నీ ఎవరు చెప్పారు అంటారేమో.. ఇంకెవరు చాణుక్యుడు.!!