తెలంగాణాలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు ఓటర్లను మంచి చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇక అధికార పార్టీ BRS అయితే ఈ విషయంలో అందరికన్నా ఒక మెట్టు పైనే ఉంది. ఒకవైపు కేసీఆర్ మరోవైపు కేటీఆర్ లు రాష్ట్రాన్ని మొత్తం చుట్టేస్తూ తాము చేసింది ఏమిటి అనాది ప్రజలకు చాలా చక్కగా వివరిస్తూ మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అంటూ అడుగుతున్నారు. ఇందులో భాగంగా కేసీఆర్ మేడ్చల్ ప్రజాశీర్వాద సభలో మాట్లాడుతూ ఎన్నికలు రాగానే మీకు కనిపించే వారిని అస్సలు నమ్మొద్దు, ఓటు వేసే ముందు ఎవరికీ వేస్తున్నామో ఎందుకు వేస్తున్నామో అలోచించి ఓటు వేయండి అంటూ కేసీఆర్ ప్రజలకు సలహాలు ఇచ్చారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా రాష్ట్రము ఆగమైతది, బాధ్యతలేని నాయకుల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టడం మంచిది కాదు.. కాబట్టి మంచి ముందుచూపుతో మీకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎంచుకోండి అంతో కేసీఆర్ ప్రజలకు చెప్పారు.
ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం ఓట్లు కావాలంటూ మీ ముందుకు వస్తున్నారు అంటూ కేసీఆర్ ఓటర్లను ఆలోచించుకోవాలన్నారు.