ఎన్నికల ఫలితాల రోజునే పెళ్లి.. వేడుకలో టీవీలు.. జగన్ అభిమాని

-

ఆయన వైఎస్ జగన్‌కు వీరాభిమాని. అందుకే.. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే మే 23న పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో జగన్ సీఎం కావడం, తన పెళ్లి కావడం.. రెండూ ఒకే రోజు జరగాలనుకున్నాడు. అందుకే ఇలా తన పెళ్లిని 23న పెట్టుకొని.. పెళ్లికి వచ్చే అతిథులందరికీ ఎన్నికల ఫలితాలు కూడా చూసేలా ఏర్పాట్లు చేశాడు.

నా పెళ్లికి రండి.. వచ్చి ఎన్నికల ఫలితాలను కూడా వీక్షించండి.. అంటూ పెళ్లి కార్డులు ఇచ్చేటప్పుడు అతిథులందరినీ ఆహ్వానించాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఆ వ్యక్తి పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version