10 రకాల రోగాలను నివారించే జ్యూస్‌.. ఎగబడి తాగుతున్న జనం..!!

-

ఈరోజుల్లో కష్టపడితే డబ్బులు వస్తాయో లేదో తెలియదు కానీ.. రోగాలు మాత్రం కచ్చితంగా వస్తున్నాయి.. గంటల తరబడి సిస్టమ్‌ ముందు కుర్చుంటే.. మీ ఆయుష్షు తగ్గిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.. బరువు పెరిగితే..భరించలేని రోగాల భారిన పడక తప్పదు. గుండెజబ్బులు అయితే ఇక చెప్పనక్కర్లేదు.. ఎవరికి వస్తున్నాయో, ఎందుకు వస్తున్నాయో తెలియకుండా ఉంది పరిస్థితి. ఆరోగ్యంగా ఉండాలంటే.. చాలా చేయాలి..అవి అన్నీ మనతోని కాదంటారా..? అయితే ఈ ఒక్క జ్యూస్‌ తాగండి చాలంటున్నారు బీహార్‌కు చెందిన సతీష్‌. 12 రకాల మూలికలతో చేసిన ఈ జ్యూస్‌… 10 రకాల రోగాలను ఇలా తగ్గిచ్చేస్తుందట..!

బీహార్‌లోని బీపీ మండల్ చౌరస్తాలో హెర్బల్ జ్యూస్ బండి పెట్టిన సతీష్ కుమార్ దగ్గరకు ప్రజలు పోటెత్తుతున్నారు. మార్నింగ్ వాక్ సమయంలో ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల ప్రజలకు మంచి ప్రయోజనం కలుగుతుందని సతీష్ చెబుతున్నాడు.
ఈ జ్యూస్ తయారీకి గిలోయ్, వేప ఆకులు, పచ్చి పసుపు, కలబంద, సహజ ఆకులు, పుదీనా, తులసి, ఉసిరి, కాకరకాయ లాంటి మొత్తం 12 మూలికలను ఉపయోగిస్తున్నట్లు సతీష్ తెలిపారు.

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, చర్మం, జుట్టు రాలడం లాంటి అనేక ఇతర వ్యాధులకు ఈ జ్యూస్ తాగడం ప్రయోజనకరంగా ఉంటుందట. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఈ జ్యూస్ గ్లాస్‌కు కేవలం 10 రూపాయలేనట.. అందుకే అందరూ తాగుతున్నారు. మన దగ్గర కూడా ఇలాంటి జ్యూస్‌ అమ్మితే చాలా మేలు జరుగుతుంది. బయట ఆ పానీపూరీలు, కట్‌లేట్లు లాంటివి తిని ఆరోగ్యాన్ని ఆగం చేసుకుంటున్నారు. అదే ఇలాంటి జ్యూస్‌ అయితే వ్యాపారం బాగుంటుంది. ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఇంట్లో రోజూ ఇలాంటివి చేసుకోవడం అంటే.. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో అయ్యే పని కాదు.. అందుకే బయట ఇలాంటి జ్యూస్లు అందుబాటులో ఉంటే ఆరోగ్యానికి మంచిది. మీకు బిజినెస్‌ పెట్టే ఐడియా ఉంటే.. ఇలాంటి వాటిపై ఎందుకు దృష్టిపెట్టకుడదు..! పెట్టుబడి తక్కువ..క్లిక్‌ అయిందంటే.. లాభాలు కూడా ఎక్కువే..!

Read more RELATED
Recommended to you

Exit mobile version