అమ్మో.. అప్పుడే పుట్టిన శిశువు డాక్టర్‌ను ఎంత కోపంగా చూస్తుందో.. వైర‌ల్ ఫోటో..!

-

సోషల్ మీడియాలో ఒక నవజాత శిశువుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది. సాధార‌ణంగా అప్పుడే పుట్టిన శిశువు ఏం చేస్తాడు? అంటే ‘ఏడుస్తాడు’ అనే సమాధానం చెబుతాం. అయితే, బ్రెజిల్‌లోని రియో డీ జెనెరియోలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డ కళ్లు తెరిచి చూడటానికి కనీసం రెండు మూడు గంటలైనా పడుతుంది. కానీ జస్ట్ అప్పుడే పుట్టిన ఓ శిశువు డెలీవరీ చేసిన డాక్టర్ వైపు కోపంగా చూసినట్లుగా ఉండే ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఓ మహిళకు వైద్యులు కాన్పు చేశారు. బిడ్డను బయటకు తీసి, బొడ్డు తాడు కట్ చేస్తోన్న సమయంలో ఆ శిశువు ముఖంలో కనపడిన ఈ హావభావాలకు వైద్యులు కూడా షాక్ అయ్యారు. ఒక నర్సు ఈ ఫొటోను తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ శిశువు పుట్టగానే ఏడవలేదు.. దీంతో ఏడిపించడానికి వైద్యులు ప్రయత్నించారు. ‘నన్నెవరూ ఏడిపించలేరు’ అన్నట్లు ఆ శిశువు కంటి చూపుతో చంపేశాడు. ఇక ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉందనీ.. ఎటువంటి సమస్యలు లేవని..కాసేపటికి ఆ శిశువు సాధారణ శిశుల్లాగానే ఉండటంతో బిడ్డ తల్లిదండ్రులతో పాటు డాక్టర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news