మురికి కాలువలో ముద్దులాట.. పిచ్చెక్కిస్తున్న ప్రీవెడ్డింగ్‌ షూట్‌..!!

-

ప్రీవెడ్డింగ్‌ షూట్‌: ఇప్పుడు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పిచ్చి జనాలకు బాగా ఎక్కేసింది.. పెళ్లంటే..ఫోటోలు, వీడియోలకే ఎక్కువ డబ్బులు ఖర్చుపెడుతున్నారు.. మంచి మంచి ప్లేస్‌లకు వెళ్లడం వీడియోలు తీసుకోవడం, డ్రోన్‌ షాట్స్‌ కూడా.. బీచ్‌లో పడుకోని డ్రోన్‌తో వీడియో తీస్తే..నెక్స్ట్‌ లెవల్‌ ఉంటుంది. ఇంకా వాటర్‌ ఫాల్స్‌ దగ్గర కూడా ఫోటోలు తీయించుకుంటారు.. కానీ అలా చేస్తే కిక్క్‌ ఏం ఉంది.. కాస్త వెరైటీగా చేద్దాం..అనుకున్నారేమో వీళ్లు.. ఏకంగా మురికికాలువలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ప్లాన్‌ చేశారు.. మురికాలువలో ముద్దులాట..! ఎవడేమంటే ఏంటట..!

 

ఓ జంట తమ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ని డ్రైనేజీలో కూర్చుని చేసుకున్నారు. నాలే మే ఫోటోషూట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ ఫోటోలు అంటే కొంత ప్రత్యేకంగా చూసే వాళ్లు కూడా ఈ జంట ప్రీ వెడ్డింగ్ పేరుతో డ్రైనేజీలో ఫోటోషూట్ చేయడం చూసి ఆశ్చర్యపోతున్నారు.

యువతి, యువకుడు డ్రెయిన్‌లో కూర్చొని ఫోటోగ్రాఫ్‌లకు పోజులిచ్చారు. హైలెట్‌ ఏంటంటే.. ఆ మురికి కాలువలో ముద్దులు కూడా పెట్టుకున్నారు..అయితే ఇది ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరుతో షేర్ చేసినప్పటికి ..వాళ్ల దుస్తులు చూస్తుంటే అలా అనిపించడం లేదు. కపుల్స్ ఇద్దరూ తక్కువ దుస్తులు వేసుకొని బీచ్‌లో లేదా సముద్రంలో కూర్చుని ఫోటోలు దిగినట్లుగా వీళ్లు డ్రైనేజీలో కూర్చొని పోజులిచ్చారు.

కపుల్స్ చుట్టూ నీళ్లు కనిపించకుండా చెత్త, చెదారం పేరుకుపోయినట్లుగా ఉన్న ఓ డ్రైనేజీ స్పాట్‌ లాంటి దగ్గర ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేసారు. చెత్త, చెదారం, మురికి నీటి మధ్యే జంట నవ్వుతూ ఫోటోలకు పోజులిచ్చారు. చూసేందుకే అసహ్యంగా ఉన్న మురికి నీళ్లలో దుస్తులు లేకుండా కూర్చొవడమే కాకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటున్నారు. అయితే ఈ ఫోటోలు చూసి చాలా మంది ఫేక్ అంటున్నారు.

మురికి నీటిలో ప్రీ వెడ్డింగ్ పేరుతో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఖచ్చితంగా ఫేక్ అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు. ఇదంతా ఎవరో ఫోటోలను ఎఢిట్ చేసి ఈవిధంగా క్రియేట్ చేశారని..

ఈరోజుల్లో ప్రస్తుతం ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ విధంగా ప్రయోగం చేసి ఉంటారని భావిస్తున్నారు. అసలు ఈ ఫోటోలు నిజమా కాదా అన్నది పక్కన పెడితే.. ఇవి మాత్రం తెగ వైరల్‌ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version