ఉద్యోగం పోయినట్లు కల వచ్చిందా…అంటే మీరు ఈ మైండ్ సెట్ తో ఉన్నారనమాట..!

-

చాలామంది కలలను పెద్దగా పట్టించుకోరు. ఏదో అలా వచ్చేసాయ్ లే అనుకుంటారు. కానీ కలలకు కూడా ఒక శాస్త్రం ఉంది..దాని ప్రకాం వచ్చే ప్రతికలకు ఒక అర్థం..సంకేతం ఉంటుంది..కలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు అంటోంది..ఆ శాస్త్రం. కలలనేవి సంబంధం లేకుండా రావు. అవి మన మనసు లోతుల్లోంచే వస్తాయి. మన ఆలోచనల్లోంచే అవి పుడతాయి. అంటే… మనం ఏ విషయాన్ని లోతుగా ఆలోచిస్తున్నామో… ఆ విషయం ఒక్కోసారిగా.. కలలాగా వస్తుంది. అందుకే మనకు వచ్చిన కలకు అర్థం ఏంటనేది మనం తెలుసుకోవాలి. దాన్ని విశ్లేషించుకోవాలి. కొంత మందికి కలల్లో ఉద్యోగం పోయినట్లు, బాస్ గుడ్‌బై చెప్పినట్లు, మిగతా ఉద్యోగులంతా వెటకారంగా నవ్వుతున్నట్లు ఇలా ఆశ్చర్యకరమైన కలలు వస్తాయి. అలాంటి కలల అర్థమేంటన్నది మానసిక వేత్తలు విశ్లేషించారు. అదేంటో చూద్దాం..

యావత్ ప్రపంచం నడుస్తుంది డబ్బుమీదే..ఎన్ని వేషాలు వేసినా..ఎన్ని విద్యలు ప్రదర్శించినా..మరెన్ని ఉద్యోగాలు చేసినా..దానికి కారణం..డబ్బే.. ఎవరికైనా డబ్బు చాలా ముఖ్యం. ఉద్యోగం అనేది ప్రతి వ్యక్తికి అత్యంత కీలక అంశం. అది ఎన్నో సమస్యలకు చెక్ పెట్టగలదు. కానీ ఆ ఉద్యోగమే పోతే… ఇక అంతకంటే పెద్ద సమస్య మరేం ఉంటుంది..? ఉద్యోగం పోయినట్లు కలవస్తే… దానర్థం నిజ జీవితంలో ఉద్యోగం పోయినట్లని కాదు. మీరు మీ మనసులో నిశ్చలంగా లేరని అర్థం. మీరు రకరకాలుగా ఆలోచిస్తూ… కొంత అయోమయం, అనిశ్చితి, ఆందోళనతో ఉన్నట్లు అర్థమట.

మీ భవిష్యత్తు గురించో లేక ఎవరితోనైనా రిలేషన్‌షిప్ గురించో లేక ఇంకేదైనా అంశంపైనో మీరు మదన పడుతున్నారు. ఇలాంటి కల వచ్చిందంటే… మీరు అప్రమత్తంగా ఉండాలి..మీకు ఓ హెచ్చరికను పంపుతుంది. మీరు స్థిరంగా ఉండాలనీ, కాన్ఫిడెన్స్‌తో మందుకెళ్లాలని చెబుతుంది. ఏది ఏమైనా మీరు ఏ సమస్యపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నారో… ముందు దానిపై ఫోకస్ పెట్టి… దాన్ని సెటిల్ చేసుకోవడం మేలని మానసిక వేత్తలు అంటున్నారు.

jobs

మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనుల్లో ఎప్పుడూ క్లారిటీని మిస్ కాకూడదు.. ఉద్యోగం పోయినట్లు వచ్చే కలకు అర్థం… భవిష్యత్తుపై క్లారిటీతో లేరని. భవిష్యత్తుపై మీరు కచ్చితమైన ప్లాన్లతో ముందుకెళ్లాలి. సతమతం అవుతూ మదనపడకూడదు అని ఈ కల మీకు హెచ్చరిస్తుందని మానసిక వేత్తల అభిప్రాయం. దీని వల్ల ఎక్కువ టెన్షన్ పడాల్సన పనిలేదు..మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడానికి ఇదో మంచి అవకాశంగా తీసుకుని..మైండ్ ని కూల్ చేసుకుంటే సరి..! ప్రాబ్లమ్ ను పరిష్కరించుకోవాలి, లేదా దాని నుంచి దూరంగా ఉండాలి..రెండు చేయకుండా..ఆ సమస్యతో సహజీవనం చేస్తే..మనోవేదన మనతో కాపురమే చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version