వాహ్‌.. క‌రోనా వైర‌స్‌ను చంపే అల్ట్రా వ‌యొలెట్ (UV) టార్చ్‌..!

-

కరోనా వైర‌స్‌ను నాశ‌నం చేసేందుకు ఇప్పుడు చాలా మంది శానిటైజ‌ర్ల‌ను, హ్యాండ్ వాష్‌ల‌ను ఉప‌యోగిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఆ వైర‌స్‌ను చంపేందుకు ఇప్పుడు ప‌లువురు ఓ ప్ర‌త్యామ్నాయ మార్గాన్ని క‌నుగొన్నారు. ఈ మేర‌కు వారు నూత‌నంగా ఓ అల్ట్రా వ‌యొలెట్ (UV) టార్చ్ ను రూపొందించారు. దీని స‌హాయంతో అనేక ప్ర‌దేశాల ఉప‌రిత‌లాల‌పై ఉండే క‌రోనా వైర‌స్‌ను నాశ‌నం చేయ‌వ‌చ్చు.

Representational Image

ముంబైకి చెందిన డాక్ట‌ర్ సొంకావ్‌డే కొల్హాపూర్‌లోని శివాజీ యూనివ‌ర్సిటీలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న కుమారుడు అనికెత్ ఔరంగాబాద్‌లోని దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ కౌశ‌ల్య కేంద్ర‌లో వొకేష‌న‌ర్ కోర్సు మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. ఇక సొంకావ్‌డే కుమార్తె పూన‌మ్ అబాసాహెబ్ గ‌ర్వారె కాలేజీలో మైక్రో బ‌యాల‌జీలో 2వ సంవ‌త్స‌రం విద్య‌ను అభ్య‌సిస్తోంది. కాగా డాక్ట‌ర్ సొంకావ్‌డే త‌న ఇద్ద‌రు పిల్ల‌లతో క‌లిసి కరోనా వైర‌స్‌ను నాశ‌నం చేసే ఓ అల్ట్రా వ‌యొలెట్ (UV) టార్చ్ ను రూపొందించారు. దీంతో ప‌రిస‌రాల‌ను క‌రోనా వైర‌స్ లేకుండా శానిటైజ్ చేయ‌వ‌చ్చు.

స‌ద‌రు యూవీ టార్చ్ స‌హాయంతో సెల్‌ఫోన్లు, కంప్యూట‌ర్ కీబోర్డులు, డోర్ నాబ్స్‌తోపాటు కూర‌గాయ‌లు, పండ్ల‌ను కూడా శానిటైజ్ చేయ‌వ‌చ్చు. ఆయా వ‌స్తువులు, ప్ర‌దేశాల‌పై ఉండే క‌రోనా వైర‌స్ న‌శిస్తుంది. ఆ టార్చ్ నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత (అల్ట్రా వ‌యొలెట్‌) కిర‌ణాలు క‌రోనా వైర‌స్‌ను నాశనం చేస్తాయి. అయితే కూర‌గాయ‌లు, పండ్లపై స‌ద‌రు కిర‌ణాల‌తో వైర‌స్‌ను చంపినా.. ఆ ప‌దార్థాల‌ను తిన‌వ‌చ్చ‌ని, అవి ఎలాంటి రేడియేష‌న్‌కు గురి కావని డాక్ట‌ర్ సొంకావ్‌డే తెలిపారు. ఇక ఆ యూవీ టార్చ్‌ను ప్ర‌స్తుతం ఓ ప్రైవేటు సంస్థ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున త‌యారు చేస్తోంది. అవి అందుబాటులోకి వ‌స్తే.. మ‌న‌కు ఎంతో ఉప‌యోగం క‌లుగుతుంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version