భక్తి: లక్కీ వెదురు మొక్కను ఇంట్లో ఉంచితే ఏం అవుతుంది…?

చాలా మంది తమ ఇళ్లల్లో లక్కీ వెదురు మొక్కను ఉంచుతారు. వర్క్ చేసే టేబుల్స్ పైన కూడా పెట్టుకుంటారు. అయితే వీటిని ఉంచితే మంచిదా కాదా..? ఈ విషయం లోకి వస్తే.. లక్కీ వెదురు మొక్కను ఉంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీని వలన ఈతిబాధలు తొలగిపోతాయి. అలానే ఇంటిలో సింహా ద్వారానికి ఎదురుగా ఉంచితే వీధి పోటు, నరదృష్టి , కంటిదృష్టి, చెడు ఎనర్జీని తీసివేసి పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది.

వ్యాపార సంస్థల లో నరదృష్టి నివారణకు, ధనం ఆకర్షణకు, వ్యాపారభివృద్ధికి ఇది చాలా మంచిది. ఈ మొక్కని ఎటు వైపు ఉంచాలి అనే విషయానికి వస్తే… ఇంటికి తూర్పు మూలలో వెదురు మొక్క ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం. ఎర్ర-రంగు బ్యాండ్‌తో ఈ మొక్కలను దగ్గరకు కట్టాలి. అలానే ఈ మొక్క సంపదను ఆకర్షిస్తుంది అని చెప్పవచ్చు. అయితే ఈ లక్కీ వెదురు మొక్క ఎలాగైతే పెరుగుతుందో అచ్చం అలానే మీ వ్యాపారం కూడా పెరుగుతుంది అంటారు.

ఇంకా గృహంలోకి ప్రతికూల శక్తులను ఇది తొలగిస్తుందని పండితులు చెప్తున్నారు. అంతే కాదండి పిల్లలు చదువు కొనే టేబుల్ దగ్గర ఉంచితే మంచి తెలివితేటలు, చదువుపై శ్రద్ధ పెరుగుతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. వీటిని ఇళ్లల్లో ఉంచడం వలన దంపతుల మధ్య అన్యోన్యత చేకూరుతుంది.