మన జీవితంలో ఫేస్బుక్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది ఈ రోజుల్లో. చాలా మంది చదువుకునే వాళ్ళు అయినా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయినా ఎవరు అయినా సరే ఫేస్బుక్ విషయంలో ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఫేస్బుక్ వాడకం తీవ్రమైనది. చదువుకునే వాళ్ళు అయితే అది లేకుండా బ్రతికే పరిస్థితి లేదు. మాస్ కి బాగా దగ్గరైన సోషల్ మీడియా దిగ్గజం ఏదైనా ఉందీ అంటే అది ఫేస్బుక్ ఏ.
ఎవరు అయినా సరే సులువగా వాడట౦ దానికి ఉన్న ప్రత్యేకత. మరి మనకు ఫేస్బుక్ ఇచ్చిన మార్క్ జూకేర్ బర్గ్ ఎం చేస్తాడు…? అతను కూడా దానికి బానిస అయిపోయాడా…? పిచ్చోడా ఎంట్రా బాబు మరీ చెప్తారు గాని. బాబుకి బుక్స్ అంటే పిచ్చి. మిమ్మల్ని ఫేస్బుక్ ఎక్కించి తాను మాత్రం చక్కగా పుస్తకాలు చదువుకుంటున్నాడు. మనని దానికి బానిస చేసి అతను మాత్రం కావాల్సిన జ్ఞానం పెంచుకుంటున్నాడు.
మనం మాత్రం పొద్దున్నే లేస్తే ఫేస్బుక్ లోనే ఉంటాం. చిన్న వార్త కూడా చదివే తీరిక మనకు ఉండటం లేదు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సిగరెట్ తయారు చేసే వాడు సిగరెట్ తాగనట్టు ఫేస్బుక్ తయారు చేసిన వాడు దానికి మిమ్మల్ని బానిసలను చేసాడు గాని తను మాత్రం అవ్వలేదు. ప్రస్తుత౦ ఈ ఫోటో ఫన్నీ గా ఉంది… సీరియస్ గా ఉంది. ఆసక్తికరంగా ఉంది.