ఆఫ్రికా దేశాలని వణికిస్తున్న మంకి పాక్స్ వైరస్..!

-

ఆఫ్రికన్ దేశాలలో మంకి పాక్స్ వైరస్ పెరిగిపోతుంది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC)లో మొదట నివేదించబడిన mpox వైరస్ ఉగాండా మరియు కెన్యాలకు వ్యాపించింది. ఇప్పుడు ఆఫ్రికా ఖండం అంతటా వ్యాపించి ప్రపంచాన్నే భయపడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా mpox వైరస్ వ్యాప్తికి భయపడుతుంది.

mpox

WHO అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించే అవకాశం ఉంది. WHO డైరెక్టర్ జనరల్, టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పెరుగుతున్న వైరస్ ని అరికట్టడానికి గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల అత్యవసర కమిటీని ఏర్పాటు చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఆఫ్రికన్ యూనియన్ ఆరోగ్య సంస్థ అయిన ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సహకారంతో మంకి పాక్స్ వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని WHO డైరెక్టర్ తెలిపారు. మంకి పాక్స్ వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అన్ని చర్యలను తీసుకురావడానికి నిధుల కొరత గురించి కూడా ఆయన చెప్పారు.

ఆఫ్రికన్ యూనియన్ (AU) శాశ్వత ప్రతినిధుల కమిటీ ఆఫ్రికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కోసం ఇప్పటికే ఉన్న COVID నిధుల నుండి $10.4 మిలియన్లను విడుదల చేయడం జరిగింది.ఈ Mpox వైరస్ లేదా మంకీపాక్స్ వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చర్మంపై దద్దుర్లు, తలనొప్పి, జ్వరంతో పాటు ఇతర లక్షణాలకు కారణమవుతుంది. ఇది జంతువులు ఇంకా మనుషుల మధ్య వ్యాపించే అంటు వ్యాధి. ప్రమాదకరమైన అంటు వ్యాధి. ఇది 2 నుండి 4 వారాల వరకు ఉంటుంది. mpox వైరస్ సోకిన మానవులతో సంబంధాన్ని నివారించడం మరియు టీకాలు తీసుకోవడం ఈ రెండు పద్ధతులు మాత్రమే ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రధాన నివారణ మార్గాలు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, mpox వైరస్ న్యుమోనియా, వాంతులు, మింగడంలో ఇబ్బంది, దృష్టి కోల్పోవడంతో పాటు కార్నియల్ ఇన్‌ఫెక్షన్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. ఇది మెదడు, గుండె ఇంకా పురీషనాళం వాపుకు కూడా కారణమవుతుంది. HIV ఇంకా బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులు mpox వైరస్ కారణంగా చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి దక్షిణాఫ్రికా అంతటా 14,250 కేసులు నిర్ధారించబడ్డాయి. 450 మందికి పైగా మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version