అంబేద్కర్ విగ్రహం మీద దాడి, శిలాఫలకం ధ్వంసం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అంబేద్కర్ స్మృతి వనం మీద సుత్తులతో రాళ్ళతో దాడి చేయడం దుర్మార్గం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేసారు. వైఎస్ జగన్ ప్రారంభించిన శిలాపలకాలను కావాలని ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు.
అర్థరాత్రి సమయం లో లైట్ లు ఆపి దాడులు చేసే వారు ప్రజలు అవ్వరు… దుండగులు అవుతారు. దీని మీద వెంటనే హోంమంత్రి స్పందించి యాక్షన్ తీసుకోవాలి. ఇదే దుష్ట సంప్రదాయం కొనసాగించాలని అనుకుంటే , వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి పనుల శిలాపలకాలను ధ్వంసం చేయాలన్న జీవో తీసుకురండి అన్నారు. ఏదో ఒక రోజు TDP ప్రభుత్వం కూడా కూలిపోతుంది.. అప్పుడు ఇలాంటి దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగిస్తే, ఏం అవుతుందో TDP నాయకులు ఆలోచించుకోవాలి అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.