గత సంవత్సరం మే 29నే రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. అయితే.. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణకు రానున్నాయి.
ఈసారి కాస్త ఆలస్యంగానే రానున్నాయి. నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఈసారి కాస్త ఆలస్యంగానే రానున్నాయి. జూన్ 11 న రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావారణ కేంద్రం స్ఫష్టం చేసింది. జూన్ 6న అవి కేరళ తీరాన్ని తాకనున్నాయి. కేరళ నుంచి ఏపీ.. ఏపీ నుంచి తెలంగాణలోకి జూన్ 11న ప్రవేశిస్తాయి. అండమాన్ దీవుల వద్ద రుతుపవనాలు ఉండటంతో ఈసారి కేరళకు రావడానికి కూడా కాస్త ఆలస్యం అవుతోంది.
గత సంవత్సరం మే 29నే రుతుపవనాలు కేరళను తాకాయి. జూన్ 8న తెలంగాణలోకి ప్రవేశించాయి. అయితే.. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా తెలంగాణకు రానున్నాయి.
అయితే… రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించేంత వరకు తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం తెలంగాణలోకి ప్రవేశించగానే… ఒకేసారి అన్ని జిల్లాలకూ రుతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే.. ఈసారి జూన్ 11న రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నా… అవి లేట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చని చెబుతున్నారు. అంటే.. మరో నాలుగైదు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.