రోజుకో అరటిపండు: పండిన నుండి పచ్చి అరటిపండు వరకు ప్యాకింగ్..!

-

ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన పండ్లలో అరటి పండు ఒకటి. ఆకలేసినప్పుడు వెంటనే అరటి పండు తింటే ఆకలి తగ్గిపోతుంది. అదే విధంగా అరటి పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే చాలా మంది అరటి పండ్లు ఇష్టంగా తింటారు.

అరటి పండ్లు ముగ్గిపోవడం అనేది పెద్ద సమస్య. అరటిపండు తినాలంటే తప్పకుండా పండిన అరటి పండును తీసుకుంటుంటారు. మరీ మెత్తగా అయిపోయిన అరటి పండును తినడానికి ఎవరూ ఇష్టపడరు. మీరు కూడా బాగా పండిపోయిన అరటిపండు తినడానికి ఇష్టపడరా..? అయితే ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్ చూడాలి.

తాజాగా నెట్టింట్లో ఈ ఫోటో వైరల్ అయిపోయింది. పండిన అరటి పండ్లు బాధ ఈసారి లేకుండా విచిత్రమైన ప్యాకింగ్ చేసింది. సౌత్ కొరియా లో ఒక ఆరు అరటిపండ్లని చిన్న బాక్స్ లో పెట్టారు. అయితే దీనిలో పండిన అరటి పండ్ల నుండి పచ్చి అరటి పండ్లు వరకు ఆర్డర్ లో ఉంటాయి.

పసుపు రంగులో ఉన్న అరటి నుండి పచ్చ రంగులో ఉన్న అరటి పండు దాకా మనం చూడొచ్చు. అయితే ఈ ఫోటో క్యాప్షన్ చూస్తే.. సౌత్ కొరియాలో కొన్ని స్టోర్స్ లో అరటి పండ్లను ఇలా ప్యాకింగ్ చేస్తున్నారని గతంలో రాశారు. దీంతో అరటి పండ్లు బాగా ముగ్గిపోకుండా ప్రతిరోజు తినడానికి వీలవుతుంది.

one day one banana అని వాళ్లు అంటున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ బాగా వైరల్ అయిపోయింది. ఇప్పటి వరకు 17800 రీట్వీట్స్ వచ్చాయి. అదే విధంగా 81 వేల నాలుగు వందలు లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. చెత్త తగ్గుతుంది అని కామెంట్లు కూడా చాలా మంది చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version