ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ అవుతున్న ఒనిడా టీవీ యాడ్‌ .. పాత జ్ఞాప‌కాలు గుర్తుకు వ‌స్తున్నాయి..!

-

టీవీల‌లో వ‌చ్చే యాడ్స్ వీక్ష‌కుల‌పై ఎంత‌టి ప్ర‌భావాన్ని చూపిస్తాయో అంద‌రికీ తెలిసిందే. యాడ్ క్లిక్ అవ్వాలే గానీ బ్రాండ్ ఆటోమేటిగ్గా జ‌నాల్లోకి వెళ్లిపోతుంది. త‌రువాత కంపెనీలు వెన‌క్కి తిరిగి చూడాల్సిన ప‌నిలేదు. అందుక‌నే యాడ్‌లకు కంపెనీలు ప్రాధాన్య‌త‌ను ఇస్తుంటాయి. ఈ క్ర‌మంలోనే 90ల‌లో వ‌చ్చిన ఒనిడా టీవీ యాడ్‌ (onida TV Ad) కూడా ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేసింది.

అప్ప‌ట్లో ఒనిడా కంపెనీకి చెందిన టీవీల గురించి యాడ్ బాగా ప్ర‌సారం అయ్యేది. అందులో ఓ భూతం టీవీలోంచి వ‌స్తుంది. దాన్ని చూసి అప్ప‌ట్లో పిల్ల‌లు జ‌డుసుకునేవారు. ఆ టీవీ అప్ప‌టి జ‌నాల‌కు ఎంత‌గానో న‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఒనిడా టీవీలు కూడా పాపుల‌ర్ అయ్యాయి. చాలా మంది ఆ టీవీల‌ను కొనుగోలు చేశారు. కొంద‌రు ఇప్ప‌టికీ వాటిని వాడుతున్నారు. ఇక తాజాగా ఓ వ్య‌క్తి అప్ప‌టి ఒనిడా టీవీ యాడ్‌ను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ యాడ్ వైర‌ల్ అవుతోంది.

అప్ప‌ట్లో తాము ఒనిడా టీవీని ఎలా కొనుగోలు చేశామోన‌ని నెటిజ‌న్లు ఆ చూసి అప్ప‌టి జ్ఞాప‌కాల‌ను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక కొంద‌రు అయితే తాము ఇప్ప‌టికీ అప్ప‌టి ఒనిడా టీవీల‌ను వాడుతున్నామ‌ని కామెంట్ చేశారు. కాగా విదేశాల్లో ప్ర‌సారం అయిన ఒనిడా టీవీ యాడ్‌లో డేవిడ్ విట్‌బ్రెడ్ న‌టించ‌గా ఇండియాలో ప్ర‌సారం అయిన అదే యాడ్‌లో అప్ప‌టి నటుడు ఆశిష్ చౌద‌రి న‌టించాడు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆ యాడ్ ను చూసిన నెటిజ‌న్లు అప్ప‌టి విష‌యాల‌ను గుర్తుకు తెచ్చుకుని కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version