డైలాగ్ ఆఫ్ ద డే : పేటీఎం క‌రో!

-

డ‌బ్బులు మాట్లాడ‌తాయి
రూపాయిలు త‌గువులు పెడ‌తాయి
అని అంటారే అయ్యో! సంప‌ద కార‌ణంగా
మేలు ఎంతో కీడూ అంతే క‌దా!
మంచు సోనల మ‌ధ్య ఇవాళ డైలాగ్ ఆఫ్ ద
పేటీఎం క‌రో!

జీవితంలో డ‌బ్బు..జీవితాంతం డ‌బ్బు.. జీవితంలో డ‌బ్బు ఓ పార్శ్వం.. ఓ అవ‌స‌రం.. జీవితాంతం డ‌బ్బు ఆశ..అవ‌స‌రం క‌న్నాఆశ‌లే అవ‌ధి దాటి ఉంటాయి.మ‌నుషుల్లో అత్యాశ‌లూ, నిరాశ‌లూ ఉంటాయి.వాటి మ‌ధ్య కొట్లాట‌ను అర్థం చేసుకుని మున్ముందుకు వెళ్ల‌డం మార్కెట్ నేర్ప‌డం లేదు.దేశ ప్ర‌ధాని నేర్ప‌డం లేదు.డిజిట‌ల్ ఇండియా అని డీజిల్ రేటు మాత్రం త‌గ్గించ‌రేం! ధ‌ర‌లు త‌గ్గ‌కుండా పూల కొట్టు ద‌గ్గ‌ర పేటీఎం క‌రో అన్న మాట వింటుంటే న‌వ్వుకున్నాను నేను..డ‌బ్బులు ఏమ‌యినా ఊరికే వ‌స్తాయా?

న‌గ‌దు ర‌హిత జీవితాన్ని ఇస్తాను మీకు అని దేశ ప్ర‌ధాని అంటుంటే ఆశ్చ‌ర్య‌పోయాం.డ‌బ్బులు లేని జీవితం క‌న్నా మిక్కిలి దుఃఖం ఒక‌టి మ‌న‌ల్ని ప‌ల‌క‌రించ‌కూడదు..అలానే డ‌బ్బులుండీ కూడా న‌గ‌దు బ‌దిలీ కాకుండా ఆ డిజిట‌ల్ ఈక్వేష‌న్స్ అడ్డు పెట్ట‌కూడ‌దు.డ‌బ్బులుంటే కాసింత ధైర్యం ఉంటుంది.అవ‌స‌రం,విలాసం మ‌ధ్య తేడా కూడా తెలిసివ‌స్తుంది.దేశాన శ‌క్తులు డ‌బ్బుల‌ను పంచేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు.మంచి ప‌ని! దేశాన్నిపాలించే శ‌క్తులు అని రాయాలి..మోడీలో నా వ‌ర‌కూ న‌చ్చేదే ఇది. అలా అని సంప‌ద సృష్టి కేంద్రాల‌ను నిర్మించ‌డం లేదు. జ‌గ‌న్ లోనూ,మోడీలోనూ కేసీఆర్ లోనూ న‌చ్చ‌నిది ఇదే! దేశాన్ని లెక్క‌కు మిక్కిలి ప్రేమించే వారంతా సంప‌ద‌ను సృష్టిస్తూ త‌మ‌ని తాము నిర్వ‌చించుకుంటే ఎంతో మేలు.

నిన్న‌టి వేళ టాటాల చేతికి ఎయిర్ ఇండియా వ‌చ్చింది.ఆ విధంగా సంప‌ద స‌ద్వినియోగం అయింద‌నే భావించాలి.కూర‌గాయలు ఆకు కూర‌లు,పండ్లు వీటి వినియోగం ద‌గ్గ‌ర సంప‌ద వినిమ‌యం అయి ఉంటుంది.వినియోగం ఎంత బాగుంటే వినిమయం కూడా అంతే బాగుండాలి.టాటా సంస్థ‌ల ఉత్ప‌త్తుల‌ను వినియోగించండి వినిమ‌యం బాగుంటుంది అని అంటున్నారంటే అందుకు కార‌ణం ఎయిర్ ఇండియా ఓ న‌మ్మ‌కం అయిన సంస్థ చేతికి వెళ్ల‌డ‌మే! క‌నుక ఆకు కూర‌లు,కాయ గూర‌లు అన్న‌వి జీవితాన్ని
న‌డిపిస్తాయి..వాటి నుంచి పుట్టే గ్రామీణ సంప‌ద అన్న‌ది ర‌తన్ టాటాలు లాంటి వారికి ఎప్పుడో ఓ సారి వినిమ‌యం అవుతుంది.

డ‌బ్బులుంటే ఏం చేస్తారు స‌ర్ అని ఇప్పుడు మీరు ప్ర‌శ్నించుకోండి( డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ప‌వ‌న్ ను ఈ విధంగానే ప్ర‌శ్నించారు) ..డ‌బ్బులుంటే వినిమ‌య సంస్కృతిని క‌ట్ట‌డి చేస్తాను అని రాయాలి..వినియోగం ఎందాక అన్న‌ది నిర్ణ‌యిస్తాను అని రాయాలి.. డ‌బ్బులుంటే మంచి ప‌నుల‌కు వినియోగించి ఈ దేశానికీ,నా వారికీ మంచి చేస్తాను అని చెప్పాలి.. ఉద‌యం వేళ వింటున్న మాట పేటీఎం క‌రో!

క‌రోడ్ ప‌తికి కూడా రోడ్ సైడ్ వినిపించే మాట ఇదే క‌దా! జీవితం డబ్బు చుట్టూ ఆశ చుట్టూ క‌న్నీటి వ‌ల‌యాల చుట్టూ..ఇంకా అమ్మ‌నాన్నల చుట్టూ..ముందు మీ త‌ల్లీ తండ్రికి వంద‌నాలు చెల్లించాక మీకంటూ ఉన్న వినిమ‌య సంస్కృతిలో డ‌బ్బు ఏ మేర‌కు ఎందుకు అవ‌స‌రం అన్న‌వి తెలుసుకోండి..డ‌బ్బులు ఊరికే రావు అని డైలాగ్ బాగుంది.. ల‌లితా జ్యూయ‌ల‌ర్స్ బాస్ చెప్పేడు.. గుండె బాస్ గుండె నిండా విశ్వాసం ఉంచి చెప్పేడు.. ఊరికే రావు క‌నుక జాగ్ర‌త్త.మ‌ళ్లీ వినండి పేటీఎం క‌రో ! భాగ్య న‌గ‌రి దారుల్లో మరియు మా శ్రీ‌కాకుళం దారుల్లో ఆ గొంతుక వినిపించే మురిపెంను!

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి

Read more RELATED
Recommended to you

Exit mobile version