ధోనీ, కోహ్లి, రోహిత్‌.. ప్ర‌జ‌ల్లో ఓటు హ‌క్కుపై చైత‌న్యం క‌లిగించండి.. ప్ర‌ధాని మోడీ ట్వీట్‌..!

-

ధోని, కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌.. మీరు క్రికెట్ మైదానంలో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పారు. కానీ ఈ సారి మాత్రం దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో ఓటు హ‌క్కు ప‌ట్ల చైత‌న్యం క‌ల‌గ‌జేయాలి..

మ‌న దేశంలో లోక్‌స‌భ ఎన్నిక‌లు లేదా ఇత‌ర రాష్ట్రాల్లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌లు లేదా మ‌రో ఎన్నిక‌లు.. ఏవి జరిగినా స‌రే.. స‌హజంగానే ఓటింగ్ శాతం చాలా త‌క్కువ‌గా న‌మోదు అవుతుంటుంది. ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు బ‌ద్ద‌కిస్తుంటారు. ముఖ్యంగా న‌గ‌ర, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో నివాసం ఉండే ఓట‌ర్లు అయితే ఓటు వేసేందుకు అస్స‌లు బ‌య‌ట‌కు రారు. ఓటింగ్ రోజు సెల‌వు ఇస్తే బ‌య‌ట‌కు వెళ్లి ఎంజాయ్ చేసేందుకు టైం ఉంటుంది.. కానీ లైన్లో నిల‌బ‌డి ఓటు వేసేందుకు, మ‌న భ‌విష్య‌త్తును నిర్ణ‌యించే నాయ‌కున్ని ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎన్నుకునేందుకు మాత్రం కొంద‌రికి టైం ఉండ‌దు. దీంతో ఓటింగ్ శాతం త‌క్కువై కొన్ని సార్లు ఫ‌లితాలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి.

క‌నుక‌నే ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా దేశంలోని రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు ఇత‌ర సెల‌బ్రిటీలు ఓటు వేసేందుకు ప్ర‌తి ఒక్క‌రు ముందుకు రావాల‌ని పిలుపునిస్తుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన నేఫ‌థ్యంలోనూ ప్ర‌ధాని మోడీ ప్ర‌జ‌ల‌కు ఓటు హ‌క్కు బాధ్య‌త‌ను తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు. ప‌లువురు సెల‌బ్రిటీల‌ను ప్ర‌జ‌లు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల‌ని ప్ర‌ధాని మోడీ కోరారు.

ప్ర‌ధాని మోడీ భార‌త క్రికెట‌ర్లు ధోని, కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌ల‌ను ఉద్దేశించి తాజాగా ట్వీట్ చేశారు. ”ధోని, కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌.. మీరు క్రికెట్ మైదానంలో ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పారు. కానీ ఈ సారి మాత్రం దేశంలోని 130 కోట్ల మంది ప్ర‌జ‌ల్లో ఓటు హ‌క్కు ప‌ట్ల చైత‌న్యం క‌ల‌గ‌జేయాలి.. వారు ఓటు హ‌క్కును వినియోగించుకునేలా చేయాలి.. అలా చేయ‌గ‌లిగితే ప్ర‌జాస్వామ్యం గెలుస్తుంది.. ” అంటూ మోడీ ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ నెట్‌లో వైర‌ల్ అవుతోంది. ఏది ఏమైనా.. స‌మాజంలో ఓటు హ‌క్కు క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రు ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ప్పుడే ప్ర‌జాస్వామ్యం గెలుస్తుంద‌నేది అక్ష్య‌ర స‌త్యం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version