ఫ్రాన్స్‌లో రోజు రోజుకీ వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతోపాటు జనాభా బాగా తగ్గుతోందట. ఈ క్రమంలో వృద్ధులకు పెన్షన్లను ఇవ్వలేమని అక్కడి ప్రభుత్వం చెబుతోందట.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ జనాభా చూసినా సరే ఏటా పెరిగిపోతోంది. దీంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజలకు సౌకర్యాలను కల్పించలేకపోతున్నాయి. మన దేశంతోపాటు పలు ఇతర దేశాల్లోనూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. అయితే యూరప్ దేశాల్లో మాత్రం జనాభా నానాటికీ తగ్గిపోతోందట. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జనాభా బాగా తగ్గుతోందట. దీంతో అక్కడి ప్రభుత్వానికి ఇదొక కొత్త సమస్యగా మారింది.
ఫ్రాన్స్‌లో రోజు రోజుకీ వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంతోపాటు జనాభా బాగా తగ్గుతోందట. ఈ క్రమంలో వృద్ధులకు పెన్షన్లను ఇవ్వలేమని అక్కడి ప్రభుత్వం చెబుతోందట. అయితే మరోవైపు పుట్టేవారి సంఖ్య కూడా బాగా తగ్గుతోందట. దీంతో జనాభా తగ్గుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న కాలంలో యువతరం ఉండదేమోననే ఆందోళన అక్కడి వారిలో నెలకొంది. ఇక దక్షిణ ఫ్రాన్స్‌లోని మాంటిరో నగరంలో కిండర్ గార్డెన్ స్కూల్స్‌లో చేరేందుకు పిల్లలు లేరట. దీంతో ఆ స్కూళ్లను మూసివేస్తున్నారట.
అయితే మాంటిరో నగరంలో ఈ పరిస్థితిని గమనించిన అక్కడి మేయర్ జనాలను పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారట. దీంతోపాటు పురుషులందరికీ ఉచితంగా వయాగ్రా మాత్రలను కూడా అందిస్తున్నారట. ఇక సంతానం లేని దంపతులకు హనీమూన్ వెళ్లేందుకు ప్రత్యేక సెలవులు, బోనస్‌లను కూడా ఇస్తున్నారట. దీంతోనైనా కపుల్స్ పిల్లల్ని ఎక్కువగా కంటారని ప్రభుత్వం భావిస్తోందట.
కాగా 2018 జనాభా లెక్కల ప్రకారం.. ఫ్రాన్స్‌లో ఒక యుక్త వయస్సులోని మహిళ కేవలం 1.06 మందికే జన్మనిస్తోందట. అంత భారీగా సంతాన సాఫల్యత రేటు పడిపోయిందట. ఇక యూరప్ మొత్తంలో ఇంత తక్కువ సంతాన సాఫల్యత రేటు ఫ్రాన్స్‌లోనే ఉండడం విశేషం. అదే అమెరికాలో అయితే ఈ రేటు 1.87 ఉండగా, జర్మనీలో 1.46 గా ఉందని సర్వేలు చెబుతున్నాయి.
అయితే గడిచిన 4 సంవత్సరాల కాలంలో ఫ్రాన్స్‌లో సంతాన సాఫల్యత రేటు మరీ ఎక్కువగా పడిపోతుండడంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగానే దంపతులను పిల్లల్ని ఎక్కువగా కనేందుకు ప్రోత్సాహకాలను అందివ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ చాలా మంది దంపతులు పిల్లల్ని కనేందుకు ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదట. అయితే భవిష్యత్తులోనైనా ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఫ్రాన్స్ ప్రభుత్వం భావిస్తోంది. ఏది ఏమైనా.. అన్ని దేశాలకు భిన్నంగా ఫ్రాన్స్‌లో జనాభా అంతగా తగ్గుతుందంటే.. నిజంగా ఆశ్చర్యమే కదా..!