ఒక బంధం లో ఉన్నప్పుడు అవతలి వాళ్ళతో చాలా విషయాలను పంచుకోవాల్సి వస్తుంది. అలా పంచుకుంటేనే ఎమోషనల్ గా బంధం స్ట్రాంగ్ అవుతుంది. అయితే కొన్నిసార్లు పంచుకోవడం వల్ల లేనిపోని అనర్థాలు వచ్చే అవకాశం ఉంది. మీ భాగస్వామితో కొన్ని విషయాలు అస్సలు చెప్పకూడదు.
మాజీ ప్రేయసి/ ప్రేమికుల విషయాలు:
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. గతంలో బంధాలు కూడా ఉంటాయి. ఆ బంధాల గురించి అస్సలు ప్రస్తుత భాగస్వామితో చర్చించవద్దు. ముఖ్యంగా మీ మాజీ ప్రేయసి/ ప్రేమికుడితో ప్రస్తుత భాగస్వామిని పోల్చవద్దు.
నీ బంధువులు చెప్పిన చాడీలు:
బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మీ భాగస్వామి గురించి ఏదో ఒకటి చెప్పారనుకోండి. సూటిగా వెళ్లి వాళ్లతో చెప్పకూడదు. దానివల్ల హర్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఆకృతి గురించి కామెంట్ చేయొద్దు:
అందంగా లేవని కానీ, ఆకర్షణీయంగా కనిపించడం లేదని కానీ నెగటివ్‍గా కామెంట్ చేయవద్దు. ఛీ.. నువ్వు చండాలంగా ఉన్నావనడం వల్ల ఎవరైనా హర్ట్ అవుతారు. మిమ్మల్ని మీ భాగస్వామి అలా అంటే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
ఫ్యామిలీ వాళ్ళు నచ్చకపోతే:
ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత చెడు ఉంటుంది. అందరూ అందరికీ నచ్చాలని లేదు. మీ భాగస్వామికి చెందిన ఫ్యామిలీలోని వారి చిన్నచిన్న అలవాట్లు మీకు నచ్చనట్లయితే వాటిని భాగస్వామితో డిస్కస్ చేయకండి.
ఆ అలవాట్లు ఎవరికీ హాని చేయకపోతే కామ్ గా ఉండటమే మంచిది.
క్రష్:
పెళ్లయిన తర్వాత కూడా క్రష్ ఫీలింగ్ రావడం సహజం. మీకలాంటి ఫీలింగ్ ఉంటే ఆ విషయాన్ని సరాసరి పట్టుకెళ్ళి భాగస్వామికి తెలియజేయవద్దు.