జాబ్ చేస్తున్నారా? మీ చుట్టూ ఇలాంటి కొలీగ్స్ ని ఉంచుకోవద్దు

-

మన చుట్టూ ఉండే మనుషులే మన అభివృద్ధిని డిసైడ్ చేస్తారు. ఈ మాట తప్పుగా అనిపించవచ్చు కానీ చాలా నిజం. మీ చుట్టూ పాజిటివ్ వ్యక్తులు ఉంటే మీరు జీవితంలో ఎదుగుతారు. నెగిటివ్ వ్యక్తులు ఉంటే లోతుల్లోకి పడిపోతారు.

మీరు జాబ్ చేస్తున్నప్పుడు మీ చుట్టుపక్కల నెగటివ్ వ్యక్తులను ఉంచుకోకూడదు.

కంప్లైంట్ చేసే వారిని:

మీ టీం లో మీ మీద ప్రతిసారి కంప్లైంట్ చేసే వాళ్లకు దూరంగా ఉండండి. పని చేతకాక మీ మీద వాళ్లు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మీ ఎనర్జీ నశించిపోతుంది.

గాసిప్స్ మాట్లాడేవారు:

ఇలాంటి వాళ్లు మొదట్లో స్నేహంగానే కనిపిస్తారు. కానీ ఆఫీసులో అందరి గురించి మీతో చెప్పే వీళ్ళు.. మీ గురించి అవతలి వాళ్ళతో చెప్తారని తెలుసుకోండి. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంటే బెటర్.

కుళ్లుకునే వారికి:

సాధారణంగా కొలీగ్స్ మధ్య కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మీరు బెస్ట్ ఎంప్లాయ్ గా నిలిచారనుకుందాం. కొద్దిమంది మాత్రమే నిజాయితీగా కంగ్రాట్స్ చెప్తారు. చాలామందికి కుళ్ళు ఉంటుంది. అలాంటి వాళ్లకు బహుదూరం పాటించండి.

మిమ్మల్ని వాడుకునే వారికి:

కొంతమంది కొలీగ్స్.. మాటిమాటికి మీ సమయాన్ని వాడుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు వచ్చేది ఏమీ ఉండదు. స్నేహం అనే పేరు చెప్పి మీ టైం వృధా చేస్తుంటారు. వీళ్ళతో యమ డేంజర్.

జడ్జ్ చేసే వాళ్ళకి:

కొంతమంది ప్రతి విషయాన్ని జడ్జ్ చేసేస్తుంటారు. వీళ్లంతే, వాళ్ళింతే అంటూ స్టేట్మెంట్లు ప్రకటిస్తారు. ఇలాంటి వాళ్లు ఎక్కువగా మేనేజర్ల మీద కోపంతో ఉంటారు. మేనేజర్లకు ఏమీ రాదు అంటారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version