పోర్న్‌కు బానిసవడం అనేది నిజం కాదు.. వెల్లడిస్తున్న నిపుణులు..

-

ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఇంటర్నెట్‌ సౌకర్యం పొందుతున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ఇంటర్నెట్‌ వల్ల పోర్న్‌ను వీక్షించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 2019లో ప్రముఖ పోర్న్‌ సైట్‌ పోర్న్‌హబ్‌కు రోజుకు 115 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయంటే పోర్న్‌ను జనాలు ఏవిధంగా చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే పోర్న్‌ చూడడం వల్ల నిజానికి ప్రయోజనాలే ఉంటున్నాయని నిపుణులు తెలుపుతున్నారు.

పోర్న్‌ను చూడడం వల్ల శరీరంలో ఫీల్‌ గుడ్‌ హార్మోన్లు విడుదలవుతాయని, అదే కపుల్స్‌ కలసి పోర్న్‌ను చూస్తే వారి శృంగార జీవితం బాగుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పోర్న్‌ను వీక్షించడాన్ని ఒక మానసిక అనారోగ్య సమస్యగా, మద్యం, డ్రగ్స్‌ లాంటి వ్యసనంగా పేర్కొనలేమని వైద్య నిపుణుల చెబుతున్నారు. అయితే.. పోర్న్‌ వీక్షించడం వల్ల లాభాలే కలిగినప్పటికీ దాన్ని అతిగా వీక్షిస్తే సమస్యలే వస్తాయంటున్నారు.

పోర్న్‌ను అతిగా వీక్షించడం వల్ల మనస్సులో ఒక గిల్టీ ఫీలింగ్‌ మొదలవుతుందని, భార్యా భర్తల్లో శృంగార జీవితంలో సమస్యలు వస్తాయని అంటున్నారు. అయితే ఎవరికైనా సరే పోర్న్‌ను అతిగా వీక్షిస్తున్నామని అనిపిస్తే మానసిక వైద్యుల సలహా పొందడం ఉత్తమమని, లేదా అత్యంత దగ్గరగా ఉండే స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆ సమస్యపై మాట్లాడి పరిష్కారం ఆలోచించాలని, పలు థెరపీలను ఆశ్రయించాలని, యోగా, ధ్యానం వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే పోర్న్‌ను ఏ మేర వీక్షిస్తే అతి అవుతుంది ? అనే విషయాన్ని మాత్రం నిపుణులు స్పష్టంగా వెల్లడించలేదు. కనుక ఈ విషయాన్ని పోర్న్‌ వీక్షించేవారు ఎవరికి వారే నిర్దారించుకోవాలి. ఆరోగ్యకరంగా ఉందనుకుంటున్నంత వరకు పోర్న్‌ను వీక్షించవచ్చు. కానీ అతిగా వీక్షిస్తున్నామనుకుంటే మాత్రం వెంటనే సలహాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version