తిరిగి మళ్ళీ అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని స్థాపించడం ఆనందంగా ఉంది: ప్రధాని మోడీ

-

కాశీ విశ్వనాథ ఆలయాన్ని గంగా గాట్లతో అనుసంధానం చేసే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి దివ్య కాశి భవ్య కాశీగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కాశీ విశ్వనాథ్ ధామ్ కారిడార్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం నాడు మొదలు పెట్టారు మోదీ. వారణాసి నగరాన్ని పర్యటించడంతో ఎంతో అందంగా వారణాసిని అలంకరించారు. 2019 లోనే ఈ కారిడార్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

మొత్తం ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కారిడార్ ని పూర్తి చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా దివ్య కాశి భవ్య కాసిని 51 వేల చోట్ల ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ కారిడార్ వల్ల యాత్రికులు ఇకపై ఘాట్ లో నుంచి ఆలయానికి వెళ్లడానికి రద్దీగా ఉండే మార్గాలలో వెళ్లే అవసరం లేకుండా దీనిని తీసుకు రావడం జరిగింది.

మోడీ మొత్తం రెండు రోజులపాటు కాశీలో గడపనున్నారు. సాయంత్రం క్రూయిజ్ బోట్ నుంచి గంగా హారతిని చూడడం పడవలో లలితా ఘాట్ కి చేరుకున్న తర్వాత ఆలయ గర్భ గుడి వద్ద 15 నిమిషాలపాటు పూజలు చేయడం జరుగుతుంది.

ప్రధాని నరేంద్ర మోడీ ఈ క్రమంలో మాట్లాడుతూ ప్రతి భారతీయుడు చేతిలో ఏదో ఫోర్స్ ఉంటుందని ఎలాంటి పెద్ద చాలెంజ్ ని అయినా సరే భారతీయులు కలిసికట్టుగా పోరాడాలని అన్నారు. అదేవిధంగా అన్నపూర్ణా దేవి విగ్రహాన్ని మళ్ళీ కాశీలో స్థాపితం చేయడం ఆనందకరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అలానే కాశీ గురించి సారనాధ్ గురించి కూడా మోడీ ఎంతో గొప్పగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version