సుప్రీంకోర్టు న్యాయవాదికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అమీన్‌పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. ఈ క్రమంలోనే ఐలాపుర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశం నిర్వహించారు.
అదే సమయంలో కమిషనర్ రంగనాథ్‌తో సుప్రీంకోర్టు న్యాయవాది ముఖిమ్ మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కేసు కోర్టులో ఉండగా మీరు ఎలా వస్తారు? అంటూ కమిషనర్ రంగనాథ్‌ను న్యాయవాది ప్రశ్నించారు. దీంతో ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటూ న్యాయవాదిపై రంగనాథ్ సీరియస్ అయ్యారు.పేదలను మోసం చేసి ప్లాట్లు విక్రయిస్తే ఊరుకునేది లేదని కమిషనర్ న్యాయవాదికి వార్నింగ్ ఇచ్చారు.