2016 నుంచి ఐటి పరిశ్రమలకు బకాయిలు పెండింగులో ఉన్నాయి : శ్రీధర్ బాబు

-

పరిశ్రమలు, ఐటి కంపెనీలు హైదరాబాద్ కే పరిమితము కాకుండా టైర్ 2, 3 నగరాలకు విస్తరించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 4500 కోట్లు 2016 నుంచి ఐటి పరిశ్రమలకు ప్రభుత్వ సబ్సిడీల బకాయిలు పెండింగులో ఉన్నాయి. ఒక్కొక్కటిగా ప్రభుత్వం చెల్లిస్తూ వస్తుంది. ఏ ఉద్దేశ్యంతో పరిశ్రమలకు ప్రభుత్వం భూములు కేటాయించారో ఆ విధంగా పరిశ్రమలు సహేతుకమైన కారణం లేకుండా స్థాపించకపోతే భూముల పై టీఎస్ ఐఐసీ నిర్ణయం తీసుకుంటాము. పరిశ్రమలకు కేటాయించిన భూముల అన్యాక్రాంతం పై కమిటీ నివేదిక వచ్చినాక చర్యలు తీసుకుంటాము.

పరిశ్రమలకు, ఐటికి సంబంధించి పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రెండు అమెరికన్ బేస్డ్ కంపెనీలు.. 9 దేశాల్లో కార్యాలయాలు ఉంటే హైదరాబాద్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం 500 మందికి, రెండేళ్ళలో 2 వేల మందికి ఉపాది కల్పిస్తామని చెప్పారు. డ్రోన్స్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ వ్యవహారాలు ఈ కంపెనీలు చూస్తాయి. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో కంపెనీ ఏర్పాటు చేశారు. పెట్టుబడిదారులు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటం. ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటి విస్తరిస్తాం. గ్రామాల్లో ఉన్న టాలెంట్ ను ఉపయోగించుకుని వారికి ఉపాధి కల్పించాలి అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version