బాలీవుడ్ నుంచి వెళ్లి హాలీవుడ్ లో సెటిల్ అయిన బ్యూటీ ప్రియాంకా చోప్రా యూఎస్ కు చెందిన సింగర్ నిక్ జొనాస్ ను ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారు. వాళ్ల ప్రేమకు ఇక ఫుల్ స్టాప్ పెట్టి.. పెళ్లి పీటలెక్కాలని వాళ్లు ఎఫ్పుడో నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వీళ్ల ఎంగేజ్ మెంట్ కూడా అయింది. ఇప్పుడు పెళ్లి కోసమే ఇక వెయిటింగ్.
వాళ్ల పెళ్లి తేదీ ఇంకా తెలియదు కానీ.. పక్కా డిసెంబర్ లోనే వాళ్ల పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. జోధ్ పూర్ లో వాళ్ల పెళ్లి జరగనుందట. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ప్రియాంకా తల్లి కూడా జోధ్ పూర్ కు వెళ్లిందట. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రియాంకా చోప్రా పెళ్లి కార్డులు ఇవే అంటూ తెగ చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి ఆహ్వాన పత్రికలో లడ్డులు కాకుండా వైరయిటీగా ఫ్రెంచ్ మకరూన్స్ ను అతిథులను ఇవ్వనుందట ప్రియాంక. దానికి సంబంధించిన ఫోటోలు మాత్రం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నారు. వావ్.. ప్రియాంక మీ పెళ్లి ఇన్విటేషన్ కార్డు అదుర్స్ అని అంటున్నారు అంతా.