కవలలకు ప్రత్యేకమైన స్కూల్ ఏంటి అని అనుకుంటున్నారా. అదేమీ లేదు కానీ ఈ స్కూల్ లో మాత్రం దాదాపు చాలా మంది కవలలు ఉండడం తో కవలల స్కూల్ అని కూడా పిలవొచ్చు. ఒకరో ఇద్దరో కవలలను చూస్తేనే మనం కన్ ఫ్యుజ్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ స్కూల్ లో మాత్రం దాదాపు 20 మంది కవలలు దర్శనమిస్తూ ఉంటారట. అయితే ఇక ఈ పాఠశాల లో ఉపాధ్యాయుల పరిస్థితి ని ఒక్కసారి ఊహించుకోవాలి. ఇంతకీ ఈ స్కూల్ ఎక్కడ ఉందొ తెలుసా, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లోని ఒక ప్రయివేట్ స్కూల్. బాలాజీ ప్రయివేట్ స్కూల్ ఒకటి ముమ్మిడివరం లో ఉంది. అయితే అదేమీ విచిత్రమో గానీ ఆ స్కూల్ లో ఎదో ఒకరో ఇద్దరో కవల పిల్లలు ఉంటే పర్లేదు కానీ ఏకంగా 20 మంది కవల పిల్లలు ఉండడం తో అక్కడి ఉపాధ్యాయులు,స్నేహితులు అందరూ కూడా వారిని గుర్తు పట్టడం లో పిచ్చెక్కిపోతున్నారు. అసలు ఎవరు ఎవరో అని పోల్చుకోవడానికి తెగ తంటాలు పడుతున్నారు. ఒకే రూపు రేఖలతో ఉండే ఆ కవలలను పోల్చుకోవడం లో అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ,స్నేహితులు తెగ ఇబ్బందులు పడుతున్నారు.
దానికి తోడు వారి పేర్లు కూడా ఒకేరకంగా ఉండడం తో వారంతా మరింత కన్ ఫ్యుజ్ అయిపోతున్నారు. రమాదేవి-లక్ష్మి దేవి,రామ్-లక్ష్మణ్,హర్షిత-హర్ష ఇలా వారి పేర్లు కూడా కన్ఫ్యుస్ క్రియేట్ చేస్తున్నాయి. ఒకే రకమైన దుస్తులు, ఒకే రకమైన ముఖ పోలికలు ఉండటంతో టీచర్లు కూడా ఒక్కోసారి ఒకరి పేరుతో మరొకరిని పిలుస్తున్నారు.