మన దగ్గర అలవాటైన ఎన్నో పద్ధతులు..వాటిని పద్ధతులు కాదు..అలవాట్లు అనాలేమో..అవి కొన్ని దేశాల్లో చేస్తే జరిమానా విధిస్తారు. ముఖ్యంగా చాలామందికి రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్లేప్పుడు..ఫోన్లో వీడియోలు చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనే వెళ్లటం అలవాటు..ఇలా చైనాలో చేస్తే..52చైనీస్ యోన్ అంటే 584 రూపాయలు ఫైన్ వేస్తారట. ఇంకా మనందరికి ఉన్న మోస్ట్ కామన్ అలవాటు…ఎక్కడికైనా వెళ్తే మన వాళ్లకోసం ప్లేస్ ఆపటం..అందుకోసం కర్చీఫ్ లేదా ఏదోఒక పెడుతుంటాం. పొరపాటున అందులో వేరే వాళ్లు కుర్చున్నారంటే..రచ్చరచ్చే..ఇలా చేయటం కూడా తప్పేనట..ఇలాంటి ఇంట్రస్టింగ్ విషయాలు ఈరోజు చూద్దాం.
కారు విండో తెరిస్తే అంతే..
మనం కారును ఎక్కడైనా పార్క్ చేస్తే విండో గ్లాస్ మూసివేసే వెళ్తాం. తెరిచి ఉంచితే..దొంగలభయం.. సో ఈ విషయం మనకు ఎవరు చెప్పకపోయినా, చట్టాలేవి లేకపోయినా కార్ విండో మూసేస్తాం. అయితే, కెనడా.. ఆస్ట్రేలియా దేశాల్లో కారు పార్క్ చేస్తే విండోస్ కచ్చితంగా మూసివేయాలని చట్టం ఉందట. ఎవరైనా అలా మూయకుండా వెళ్తే వారికి కెనడాలో 81 కెనడా డాలర్లు జరిమానా వేస్తారు.
చిల్లర ఎక్కువ ఇచ్చిన ఫైనే
బస్సుల్లో వెళ్లేప్పుడు కండాక్టర్ కి మనకు చిల్లర దగ్గరే గొడవులు వస్తుంటాయి. కొంత మంది చిల్లర నాణేలతోనే షాపింగ్ చేస్తుంటారు. అయితే, కెనడాలో డబ్బులు చెల్లించే సమయంలో ఎన్ని నాణేలు ఇవ్వాలో తెలిపే చట్టం ఉంది. నిబంధనకు మించి ఎక్కవు నాణేలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే.. జరిమానా విధిస్తారట.ఎంత అనేది తెలియలేదు.
ఇంధనం తక్కువుంటే ఆ రహదారిపైకి రావొద్దు
మనం జర్నీ చేసే సమయంలో రోడ్డుమీద పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంటాం. కానీ జర్మనీలోని అటోబాన్ రహదారిలో పెట్రోల్ తక్కువ ఉంటే అసలు పోవద్దు. నిత్యం బిజీగా ఉండే ఈ రోడ్డుపై తక్కువ ఇంధనంతో వెళ్తే పోలీసులు జరిమానా విధిస్తారట.. ఎందుకంటే ఈ రోడ్డుపై వాహనాలు కనీసం గంటలకు వంద కి.మీ వేగంతో వెళ్తుంటాయి. అలాంటిది.. తక్కువ ఇంధనంతో వెళ్లి రహదారి మధ్యలో ఆగిపోతే.. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగించినట్లేకదా. అందుకే రహదారికి వెళ్లే ముందే పోలీసులు కారులో ఇంధనం నిల్వ ఎంత ఉందో పరిశీలిస్తారు. తక్కువగా ఉన్నట్లయితే 70 పౌండ్లు జరిమానా వేస్తారు.
రుమాలు వేసి రిజర్వ్ చేసుకున్నారో..ఐపాయే..!
మనందరికి ఇది బై బర్త్ వచ్చిన అలవాటేమోకదా..రిజర్వేషన్ లేని బస్సుల్లో, రైళ్లలో.. క్యూలో నిలబడాల్సిన ఏ చోటైనా ముందుగా వచ్చి రుమాలు లేదా బ్యాగులు వేసి సీటు బుక్ చేసుకోవడం మన దగ్గర సాధారణమే. అయితే, ఇటలీలోని టుస్కానీ నుంచి సార్డానియా వరకు బీచుల్లో పడుకునేందుకు చోటును పర్యటకులు ఈ విధంగా ముందుగానే రుమాలు, బ్యాగ్‌లు పెట్టి బుక్ చేసుకోవడానికి వీల్లేదు. అలా ఎవరైనా చేస్తే 200 పౌండ్లు జరిమానా వేస్తారు. అలాగే బీచుల్లో మనం మట్టిగూళ్లు నిర్మిస్తుంటాం. కానీ, ఇటలీలో అలా కడితే 250 పౌండ్లు ఫైన్ వేస్తారు. భలే ఉంది కదా..
లో దుస్తులు కనిపించేలా ప్యాంట్ ధరిస్తే..
ఇదైతే..మనదగ్గర ఫ్యాషెన్ అయిపోయింది. కొంతమంది అబ్బాయిలు తమ లోదుస్తులు కనిపించేలా ప్యాంట్ వేసుకుంటారు. అదో ట్రెండ్ మరీ. ఈ స్టైల్‌ను ‘సాగ్గింగ్’అని పిలుస్తుంటారు. చాలా దేశాల్లో ఈ ఫ్యాషన్ ఫాలో అవుతున్నారు. కానీ, అమెరికాలోని టిమ్మన్స్విల్లే, సౌత్ కరోలినా సహ మరికొన్ని ప్రాంతాల్లో ఈ సాగ్గింగ్ స్టైల్ ప్యాంట్లు వేసుకోవడం నిషేధించారు. ఎవరైనా అలాంటి ప్యాంట్లు వేసుకొని కనిపిస్తే అధికారులు 600 డాలర్లు జరిమానా వేస్తారు.
కారులో బంగాళదుంపలు 5కేజీలు కంటే ఎక్కువ ఉండొద్దు.
ఆస్ట్రేలియాలో ఒకప్పుడు తాత్కాలికంగా తీసుకొచ్చిన చట్టాన్ని ఇప్పటికీ అమలు చేస్తున్నారు.. ది గ్రేట్ డిప్రెషన్, రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో ఆహారపదార్థాల రవాణాపై అనేక నిబంధనలు తీసుకొచ్చారు. ఈ క్రమంలో బంగాళదుంపలను ఒకరు ఒకసారి కారులో కేవలం 5 కేజీల బంగాళదుంపలను మాత్రమే తీసుకెళ్లడానికి వీలుండేది. ఎందుకంటే ఆ సమయంలో ప్రజలందరికీ ఆహారం అందుబాటులో ఉంచడం కోసం.. పెద్ద మొత్తంలో ఎవరూ ఆహారం నిల్వ చేసుకోకుండా ఈ చట్టాల్ని చేశారు. అయితే, ఇప్పటికీ ఈ చట్టం అమల్లో ఉంది. ఎవరైనా కారులో 5 కేజీలకు మించి బంగాళదుంపలను తీసుకెళ్తే 2వేల ఆస్ట్రేలియన్ డాలర్లు చలానా వేస్తారట.
అవి శుభ్రంగా ఉంచకపోతే భారీ జరిమానా
పబ్లిక్ టాయిలెట్లు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఎవరూ పరిశుభ్రత పాటించరు. సింగపూర్‌లో అయితే టాయిలెట్‌ను శుభ్రంగా ఉంచకపోతే 500సింగపూర్ డాలర్లు జరిమానా విధిస్తారట.కానీ ఇక్కడ మాకు వచ్చిన సందేహం ఎవరిమీద వేస్తారు. ఆ టైంకు ఎవరు ఉంటే వాళ్లే బలవుతారా? అలాగే, అనుమతి లేకుండా ఇరుగుపొరుగు వారి వైఫైతో ఇంటర్నెట్ ఉపయోగిస్తే 10వేల సింగపూర్ డాలర్లు ఫైన్ కట్టాలి.
ఆదివారం నిశ్శబ్దం పాటించాలి
ఆదివారం ప్రపంచమంతా సెలవు దినం. వారమంతా ఆఫీసు, పాఠశాల, చదువు అంటూ బిజీగా గడిపేవాళ్లు ఆదివారం సంతోషంగా గడపడాలని చూస్తారు. సినిమాలకు, షికార్లకు వెళ్తారు. మరికొందరు ఇంట్లోనే టీవీ చూస్తూ.. పాటలు వింటూ ఎంజాయ్ చేస్తారు. అయితే, జర్మనీలో మాత్రం మీరేం చేసినా బయటకు శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి. లేదంటే భారీ మొత్తంలో జరిమానా కట్టాలి. ఆదివారం రోజున ఎవరూ శబ్దాలు చేయకూడదని అక్కడ నిబంధన. ఇరుగుపొరుగు వాళ్లు మీరు చేసే శబ్దాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారంటే.. 50వేల పౌండ్లు జరిమానా కట్టాల్సిందే. ఇది బాగుంది కదా.మన దగ్గర కూడా పబ్లిక్ నూసెన్స్ చేయొద్దని రూల్ ఉన్నా ఎవడూ పాటించడూ అనేది జగమెరిగిన సత్యం.
తింటూ వాహనం నడపొద్దు
తాగి వాహనాలు నడపొద్దు అంటేనే ఎవరూ వినటం లేదు. రోజూ ఎన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చూస్తూనే ఉన్నాం. కారు నడుపుతూ తినకూడదని ఇంగ్లాండ్ ప్రభుత్వం అంటోంది. ఎవరైనా తింటూ కారు నడిపిస్తే పోలీసులు 93 పౌండ్లు జరిమానా వేస్తారట.
ఇలాంటి చట్టాలు..ఇలాంటి పైన్ లు మన దగ్గర ఉంటే..ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారేమో కదా..!